
సాక్షి, హైదరాబాద్: సిద్దిపేట జిల్లాలోని తోగుట, వేములఘాట్, పల్లెపహాడ్, ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామాల్లో మల్లన్నసాగర్ ప్రాజెక్టు పనుల్ని వారం రోజుల పాటు నిలిపేయాలని, ఆ గ్రామాల్లో నిలిపేసిన విద్యుత్‌ను తిరిగి సరఫరా చేయాలని హైకోర్టు మధ్యంతర ఆదేశాలిచి్చంది.
తోగుట గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించి ప్రాజెక్టు వల్ల నష్టపోయే వారికి పునరావాస చర్యలపై నివేదిక ఇవ్వాలని గత విచారణ సమయంలో హైకోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడాన్ని రైతుల తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. రైతులు దాఖలు చేసిన రిట్లను శుక్రవారం న్యాయమూర్తులు జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం మరోసారి విచారించింది. విచారణను 30కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment