సాక్షి, సిద్ధిపేట: ఆడపిల్లలు లేని ఇల్లు చంద్రుడు లేని ఆకాశం లాంటిదని ప్రపంచ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ అన్నారు. గురువారమిక్కడ ఓ కార్యక్రమంలో పాల్గొన్న నైనా జైస్వాల్.. యువత అనుకుంటే ఓ కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులా తయారు కావొచ్చన్నారు. సిద్ధిపేట గడ్డకు పోరాటాల చరిత్ర ఉందని తెలిపారు. క్రమశిక్షణ పోరాటాలు, త్యాగం లాంటి పదాలకు యువత నాంది కావాలని పిలుపునిచ్చారు.
విద్యార్థులు చెడు మార్గంలో నడవడానికి మొదట తల్లిదండ్రులు, తర్వాత ప్రైమరీ స్కూల్ టీచర్లే కారణమని సైకాలజిస్ట్ గంప నాగేశ్వర రావు అన్నారు. విద్యార్థులు ఎదగాలి అంటే బిడియం, మొహమాటం బద్దకం లాంటివి వదిలేయ్యాలన్నారు. మనం భూమి మీద ప్రాణం తో ఉండడమే గొప్ప విజయం... ఇక మిగతావన్నీ సాధ్యమయ్యే పనులే అన్నారు. టీవీలకు, సోషల్ మీడియాకు విద్యార్థులు దూరంగా ఉండాలని ఆయన సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment