
కమిషనర్ జోయల్ డేవిస్
సాక్షి, సిద్దిపేట: జిల్లాలోని కమిషనరేట్ పరిధిలో 9వ తేదీ నుంచి సిటీ పోలీస్ యాక్టు అమల్లో ఉంటుందని పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని 22 (1), 22 (2) సిటీ పోలీస్ యాక్టు అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ నెల 15వ తేదీ వరకు అమల్లో ఉంటుందన్నారు. ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించరాదన్నారు. బంద్‌ల పేరిట బలవంతంగా సంస్థలను, కార్యాలయాలను మూసి వేయాలని ఒత్తిడి, బెదిరింపులకు గురి చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.