City Police Act
-
కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్
సాక్షి, సిద్దిపేట: జిల్లాలోని కమిషనరేట్ పరిధిలో 9వ తేదీ నుంచి సిటీ పోలీస్ యాక్టు అమల్లో ఉంటుందని పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని 22 (1), 22 (2) సిటీ పోలీస్ యాక్టు అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ నెల 15వ తేదీ వరకు అమల్లో ఉంటుందన్నారు. ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించరాదన్నారు. బంద్‌ల పేరిట బలవంతంగా సంస్థలను, కార్యాలయాలను మూసి వేయాలని ఒత్తిడి, బెదిరింపులకు గురి చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
‘బ్యాండ్’ పడుతోంది...
రాజధానిలో బారాత్లపై ఆంక్షలు - శబ్ద కాలుష్యం కలిగిస్తే ఊచలే - సాదాసీదాగా రాత్రి 10లోపే ముగించాలి - డప్పు కళాకారులకు సంకటం హైదరాబాద్: చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడి పెళ్లి సందర్భంగా సీతాఫల్మండి చౌరస్తా నుంచి డప్పువాయిద్యాలతో బారాత్ తీసేందుకు సిద్ధ మయ్యారు. డప్పు మోగకముందే పోలీసులొచ్చారు. డప్పు కళాకారులను హెచ్చరించడంతో వధూవరుల ను రోడ్డుపైనే వదిలేసి∙వారు ఉడాయించారు. మరు సటి రోజు సదరు యువకుడు పోలీసుల అనుమతి తీసుకొని సాదాసీదాగా బారాత్ చేసుకోవాల్సి వచ్చిం ది. అదీ ఇతరులకు ఇబ్బంది కలుగకుండా రాత్రి 10 గంటల్లోపే.. ఇలాంటి పరిస్థితులు సీతాఫల్మండి లోనే కాదు నగరంలోని బారాత్ నిర్వాహకులందరికీ ప్రాణ సంకటంగా మారింది. పోలీసులొచ్చాక చూద్దాం అని డప్పు మోగిస్తే కేసులు నమోదు చేస్తు న్నారు. పేరుకు పెట్టీ కేసులే అయినా 2–4 రోజులు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తోంది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో నిషేధాజ్ఞలు పెళ్లి సందడిపై ప్రభావం చూపుతున్నాయి. డీజేలపై కొంతకాలం నుంచే ఆంక్షలుండగా తాజాగా డప్పు కళాకారులకూ పోలీసు నిబంధనలు ప్రాణ సంకటంగా మారాయి. బారాత్ బాజా మోగిందో కటకటాల పాలవడం ఖాయమైపోతోంది. అట్టహాసం సంగతి పక్కన పెట్టి నాలుగు డప్పులు మోగించి నా పోలీసులు న్యూ సెన్స్, శబ్ద కాలుష్యం కేసులు నమోదు చేస్తున్నారు. బారాత్ నిర్వాహకులపై కేసులు నమోదు చేసి జైలుకు తరలిస్తున్నారు. దీంతో పోలీసు పర్మిషన్ లేనిదే వాయించేది లేదంటున్నారు. ఉత్తర మండలంలో 300 మంది.. వివాహాలు చేసుకునే వారి గుండెల్లో తాజాగా సిటీ పోలీస్ యాక్టు 49 మోగుతోంది. పోలీసుల అనుమతి లేకుండా బారాత్‌లు, ఫంక్షన్ ప్యాలెస్‌లలో ఎక్కువ శబ్దంతో ప్రజలకు ఇబ్బంది కలిగించారని ఉత్తర మం డలం పరిధిలోని 11 పోలీస్స్టేషన్ల పరిధిలో 300 మం దిపై పెట్టీ కేసులు నమోదయ్యాయి. వీరంతా 2–5 రోజులు జైలు శిక్ష అనుభవించారు. దీంతో పోలీసుల అనుమతి కోసం ఏసీపీ కార్యాలయం చుట్టూ తిరగటం కన్నా బారాత్, సౌండ్స్ లేకపోవడమే మంచిదని కొందరు మిన్నకుంటున్నారు. పోలీసులు అంటున్నారిలా.. నాలుగు డప్పులు పెట్టి నలుగురితో ఊరే గింపు తీసినా అనుమతి తీసుకోవాల్సిందేనని పోలీ సులు అంటున్నారు. ఇతరులకు ఇబ్బంది కలిగిం చకుండా రాత్రి 10 లోపే బారాత్ ముగిస్తామనే షర తులకు ఒప్పుకుని వారు నివసించే ప్రాంతంలోని ఏసీపీ కార్యాలయం నుంచి అనుమతి తీసుకోవా లంటున్నారు. ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేయడం లేదని, ప్రజలు ఫిర్యాదు చేస్తేనే బాధ్యులను అరెస్టు చేసి కేసులు నమోదు చేస్తున్నామని చెబుతున్నారు. -
సిటీ పోలీసు యాక్ట్‌కు ‘కొత్త కోరలు’
సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా సవరణలు ముసాయిదాకు తుది రూపునిస్తున్న ప్రత్యేక కమిటీ లోపాలకు తావు లేకుండా పక్కాగా రూపకల్పన ⇒ఏటీఎం కేంద్రాల వద్ద పక్కాగా సెక్యూరిటీ గార్డుల్ని ఏర్పాటు చేయమని పోలీసులు మొత్తుకుంటున్నా ఫలితం ఉండటంలేదు. ⇒నడిరోడ్డుపై మద్యం తాగుతూ ఆకతాయిలు స్థానికులు, మహిళలకు ఇబ్బందులు కలిగిస్తున్నా కేవలం ఫైన్‌తో సరిపెట్టాల్సిందే. ⇒నలుగురిలో అభ్యంతరకరంగా, ఇతరులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించినా ఠాణాకు తీసుకొచ్చి నామమాత్రపు చర్యలతో సరిపెట్టాల్సిందే. ఇటు ఐపీసీ, అటు ఇతర చట్టాల పరిధిలోకి రాని ఇలాంటి అంశాలెన్నో సమాజంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. సరైన చట్టం లేకపోవడంతో ఇలాంటి సమస్యాత్మక వ్యక్తులు చట్టం నుంచి తప్పించుకొని మళ్లీ మళ్లీ సమస్యలు సృష్టిస్తున్నారు. ఈ తరహా అనేక ఇబ్బందులకు పరిష్కారంగా నగర పోలీసు విభాగం హైదరాబాద్ సిటీ పోలీసు యాక్ట్‌ను సమూలంగా సవరిస్తోంది. నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ఆలోచనల మేరకు ఏర్పాటైన ఓ కమిటీ ఇటు పోలీసు, అటు న్యాయ నిపుణులతో విస్తృతంగా చర్చిస్తోంది. ఫస్లీ టు సీపీ యాక్ట్... ప్రస్తుతం నగర పోలీసు విభాగం అనుసరిస్తున్న సిటీ పోలీసు యాక్ట్‌కు మూలం నిజాం హయాంలో అమలులోకి వచ్చిన ఫస్లీ. 1955 అక్టోబర్ 11 నుంచి అమలులోకి వచ్చిన సిటీ పోలీసు కమిషనరేట్ కోసం ఈ ఫస్లీలో కొన్ని స్వల్ప మార్పు చేర్పులు చేశారు. అందులో భాగంగా అప్పట్లో సిటీలో ఉన్న సమస్యల ఆధారంగా కొన్ని అంశాలపై చర్యలు తీసుకునే అవకాశాన్ని కమిషనర్‌కు ఇస్తూ పొందుపరిచారు. ఇలాంటి నేరాలు సీపీ యాక్ట్‌లో 31 రకాలు ఉన్నాయి. ఇవన్నీ కేవలం జరిమానా మాత్రమే విధించే అవకాశం ఉన్న కాంపౌండబుల్ అఫెన్సులే. జరిమానాలు సైతం నామమాత్రం ఉండటంతో పదేపదే అదే తరహా నేరాలు చేసే వారి సంఖ్యా ఎక్కువగానే ఉంటోంది. రహదారులపై ధర్నాలు చేస్తూ ట్రాఫిక్‌తో పాటు సామాన్యులకూ ఇబ్బందులు సృష్టించిన వారి పైనా కఠిన చర్యలు తీసుకోలేకపోవడమే దీనికి నిదర్శనం. 16 ఏళ్లలో ఎన్నో మార్పులు... నగర పోలీసులకు శిక్షణ సమయంలోనే పోలీసు యాక్ట్‌పై అవగాహన కల్పిస్తారు. సమకాలీన అవసరాలకు అనుగుణంగా సీపీ యాక్ట్‌లో మార్పు చేర్పులు చేయాల్సి ఉన్నా... ఇంతకాలం అది జరగలేదు. అయితే 2000 సంవత్సరం తరవాత దేశ వ్యాప్తంగా చట్టాల్లో అనేక మార్పులు, సవరణలు జరిగాయి. నిర్భయతో సహా అనేక కొత్త చట్టాలు అమలులోకి వచ్చాయి. వీటి పరిధిలోకీ రాకుండా సామాన్యులకు ఇబ్బందులకు కలిగించే సమస్యలు ఉన్నట్లు నగర పోలీసు అధికారులు గుర్తించారు. దీని కోసమే సీపీ యాక్ట్ రివ్యూ కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సమకాలీన అవసరాలకు తగ్గట్టు... ఈ కమిటీ సీపీ యాక్ట్‌తో పాటు ప్రస్తుతం ఉన్న సమస్యలు, ఇబ్బందుల్ని పలు కోణాల్లో అధ్యయనం చేస్తోంది. ఈ చట్టంలో ప్రస్తుత కాలం, అవసరాలను అనుగుణంగా లేని పలు అంశాలను తొలగించాలని భావిస్తోంది. 1955 తర్వాత అమలులోకి వచ్చిన చట్టాలు, సవరణలతో పాటు సమాజంలో పెరిగిన సవాళ్లను పరిగణలోకి తీసుకుంటోంది. ఆ అంశాలన్నింటి పైనా చర్యలు తీసుకునేలా సీపీ యాక్ట్ సవరణ ముసాయిదా రూపొందిస్తోంది. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటున్న సవరణలతో కూడిన ముసాయిదాను త్వరలో ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ప్రభుత్వ పరిశీలన అనంతరం అవసరమైన మార్పు చేర్పులు చేసి శాసస సభ ద్వారా సవరణలకు ముద్ర వేయించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక జీవో విడుదల చేయడం ద్వారా సర్కారు సవరించిన సీపీ యాక్ట్‌ను అమలులోకి తీసుకురానున్నారు.