సాక్షి, సిద్ధిపేట: జగదేవ్‌పూర్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మునిగడపలో అదుపుతప్పిన కారు గుంతలో పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
బోనగిరి యాదాద్రి జిల్లా బీబీనగర్ గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు దైవదర్శనం నిమిత్తం వేములవాడకు వెళ్లి తిరుగు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మునిగడప గ్రామం వద్ద కెనాల్ కాలువలో కారు పడింది. మృతులను సత్తమ్మ, స్రవంతి, లోకేష్, భవ్య శ్రీ, రాజమణిగా గుర్తించారు. వెంకటేష్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment