హుస్నాబాద్ కార్నర్ మీటింగ్‌లో మాట్లాడుతున్న రేవంత్. చిత్రంలో బలరాం, పొన్నం, జీవన్‌రెడ్డి
సాక్షి, సిద్దిపేట/హుస్నాబాద్: బాన్సువాడ పర్యటనలో ‘నేను ముసలోణ్ణి అయ్యా. వయస్సు మీద పడింది..’అని చెప్పిన సీఎం కేసీఆర్ వెంటనే రాజకీయాల నుంచి విరమించుకుని ఫాంహౌస్‌లో ప్రశాంతంగా శేష జీవితం గడపాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సూచించారు. ప్రజలు కూడా కేసీఆర్‌కు బైబై చెప్పి కాంగ్రెస్‌కు స్వాగతం పలకాలని అన్నారు. రేవంత్ హాథ్ సే హాథ్ జోడో యాత్ర గురువారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో కొనసాగింది.
తొలుత గండిపెల్లి రిజర్వాయర్‌ను సందర్శించారు. అనంతరం గౌరవెల్లి రిజర్వాయర్‌లో పరిహారం దక్కని ఆడబిడ్డలతో సమావేశం అయ్యారు. అనంతరం పాద యాత్రగా హుస్నాబాద్ చేరుకున్నారు. డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్నర్ సమావేశంలో మాట్లాడారు.
సీఎం కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నేరవేర్చలేదని విమర్శించారు. ప్రజలకు పూర్వ వైభవం రావాలంటే, పేదల బతుకులు మారాలంటే కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలని అన్నారు. పార్టీ నేతలు జీవన్‌రెడ్డి, జానారెడ్డి, బలరాం నాయక్, సుదర్శన్‌రెడ్డి, రాజయ్య, ప్రవీణ్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment