గాయపడిన విద్యార్థులకు ఆస్పత్రిలో వైద్యం చేయిస్తున్న గ్రామస్తులు
దుబ్బాకరూరల్: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు విచక్షణ మరిచాడు. తాగొచ్చి మద్యం మత్తులో విద్యార్థులను చితకబాదాడు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని పద్మనాభుని పల్లిలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. వి ద్యార్థులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకా రం.. గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న అమ్మన సంజీవరెడ్డి ఫుల్‌గా మద్యం సేవించి పాఠశాలకు వచ్చాడు.
ఆ మత్తు లో 2, 3, 4, 5 తరగతులకు చెందిన 12 మంది విద్యార్థులను బెత్తంతో చితక బాదాడు. అంతేకా దు చెంపలు, తొడలపై రక్తం కారేటట్లు గోటి వేళ్లతో గీరాడు. తరువాత విద్యార్థుల అరుపులు బయ టకు వినపడకుంగా తరగతి గదికి తలుపులు వేసి బంధించాడు. పాఠశాల సమయం ముగిసిన తరువాత విద్యార్థులను వదిలేశాడు. ఇంటికి వెళ్లిన విద్యార్థులకు తల్లిదండ్రులకు చెప్పడంతో, ఆగ్ర హించిన వారు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు.
విషయం తెలుసుకున్న మండల విద్యాధి కారి ప్రభుదాస్ పాఠశాలకు చేరుకున్నారు. గాయ పడిన విద్యార్థులకు ఎంఈఓ ప్రభుదాస్, సర్పంచ్ పర్శరాములు ఆధ్వర్యంలో తిమ్మాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేయించారు. బాధిత విద్యార్థులు మనోజ్, వర్షిత, సుషాంత్, హరీశ్, ప్రసాద్, రాకేష్, రిత్విక్, హర్షిత్, లోకేష్, నిష్విత, స్పందన, రవళిలనుంచి సమాచారం సేకరించారు. గతంలోనూ మద్యం సేవించి పాఠశాలకు వస్తే ఉపాధ్యాయుడిని మందలించామని తల్లిదండ్రులు విద్యాధికారికి తెలిపారు. ఉపాధ్యాయుడు సంజీవ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని గ్రామస్తులంతా ఎంఈఓ ఆధ్వర్యంలో తీర్మానం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment