Medchal Crime News: Extra Marital Affair, Wife Assassinated Husband With Help Of Lover In Medchal - Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం: భర్త పడుకున్న తర్వాత ప్రియుడ్ని ఇంటికి పిలిపించుకొని..

Published Tue, Jan 25 2022 8:44 AM | Last Updated on Tue, Jan 25 2022 10:07 AM

Extra Marital Affair: Wife Assassinated Husband With help Of Lover In Medchal - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, మేడ్చల్‌ రూరల్‌: వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ ప్రియుడి మోజులో పడి తమ ఇంటిలోనే వివాహేతర బంధం కొనసాగించి భర్తకు పట్టుపడింది. తమ గుట్టురట్టయ్యిందని భావించి తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ప్రియుడితో కలిసి కడతేర్చి కటకటాలపాలైన భార్య, ప్రియుడికి మేడ్చల్‌ కోర్టు జీవిత ఖైదు విధిస్తూ సోమవారం తీర్పు ఇచ్చింది.

మేడ్చల్‌ మండలంలోని అక్బర్జాపేట్‌ గ్రామానికి చెందిన మహంకాళి లక్ష్మి, మహంకాళి కృష్ణ దంపతులు. అదే గ్రామానికి చెందిన గుంటి బాలరాజ్‌ 2014లో మహంకాళి కృష్ణ ఆటో కొనుగోలు చేయడం అప్పటి నుంచి వీరి మధ్య స్నేహం ఏర్పడింది. స్నేహాన్ని అడ్డుపెట్టుకుని తరచూ కృష్ణ ఇంటికి వెళ్లిన గుంటి బాలరాజు అతడి భార్య లక్ష్మితో పరిచయం ఏర్పరచుకున్నారు. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది.  
చదవండి: హైదరాబాద్‌లో దారుణం.. కన్న తల్లిని కడతేర్చిన సైకో కొడుకు..

భర్తకు విషయం తెలియడంతో అడ్డు తొలగించుకోవాలని.. 
► వీరి విషయం తెలియడంతో మహంకాళి కృష్ణ తన భార్యను మందలించాడు. భర్త అడ్డు తొలగించుకోవాలని మహంకాళి లక్ష్మి, ప్రియుడు గుంటి బాలరాజ్‌తో కలిసి పథకం వేసుకున్నారు. అందులో భాగంగా పలుమార్లు మహంకాళి కృష్ణకు కల్లులో నిద్రమాత్రలు కలిపి తాగించినా మృతుడికి ఏమీ కాలేదు. 

తీగను మెడకు చుట్టి..
2020 ఏప్రిల్‌ 8న రాత్రి సమయంలో మహంకాళి లక్ష్మి భర్త నిద్రపోయిన తర్వాత ప్రియుడు గుంటి బాలరాజ్‌కు ఫోన్‌ చేసి ఇంటికి పిలుచుకుని తమ అక్రమ బంధం కొనసాగిస్తుండగా వీరి శబ్ధం విని నిద్రలేచిన కృష్ణ వారిని పట్టుకున్నాడు. దీంతో ముందే వేసుకున్న ప్లాన్‌ ప్రకారం కృష్ణను తీగలతో మెడను బిగించి హతమార్చారు. హత్య విషయం బయట పడకుండా కరోనా సమయంలో కల్లు (మద్యం) దొరకకపోవడంతో మనస్తాపంతో మరణించినట్లు కట్టుకథ అల్లింది.  
చదవండి: వివాహేతర సంబంధం: సాంబార్‌లో విషం కలిపి..

మృతుడి సోదరుడి ఫిర్యాదుతో బయటపడిన విషయం.. 
మృతుడి సోదరుడు మహంకాళి సురేశ్‌ మృతుడి దేహంపై గాయాలు చూసి అనుమానం వ్యక్తం చేస్తూ మేడ్చల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు హత్యగా గుర్తించి మహంకాళి లక్ష్మి,గుంటి బాలరాజ్‌లను రిమాండ్‌కు తరలించారు. కాగా మేడ్చల్‌ 11 ఏడీజే కోర్టులో సోమవారం కేసు విచారణ రావడంతో న్యాయమూర్తి జయంతి కేసు విచారణ జరిపారు. ఇద్దరకి జీవిత కాలం కఠిన కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.3వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement