
ప్రతీకాత్మక చిత్రం
జైపూర్ : వివాహేతర సంబంధం కారణంగా ఓ యువకుడిని మహిళ గొంతు నులిమ హత్య చేసింది. ఈ ఘటన జైపూర్‌లో వెలుగుచూసింది. మృతుడిని సుభాష్ కుమావత్‌గా పోలీసులు గుర్తించారు. మృతుడి ఫోన్‌ను పరిశీలించడంతో పాటు అక్కడున్న ఆధారాలను బట్టి మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుమావత్ పొరుగున ఉండే మహిళకు సంబంధించిన పలు వీడియోలు బాధితుడి ఫోన్‌లో ఉండటంతో ఆమెను గట్టిగా ప్రశ్నించగా ఈ బండారం బయటపడింది.
వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం మహిళ భర్త పనికి వెళ్లినప్పుడు కుమావత్ తన ఇంటికి వెళ్లినట్లు నిందితురాలు పోలీసులకు తెలిపింది. కుమావత్ తనతో సన్నిహితంగా మెలగడానికి ప్రయత్నించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, అతడిని అడ్డుకునే ప్రయత్నంలో గొంతు నులిమి హత్య చేసినట్లు ఆమె తెలిపింది. అనంతరం ఆ మృతదేహాన్ని కిటికీ దగ్గరకు లాక్కెళ్లి ఏదో పని నిమిత్తం తాను ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలిపింది. కుమావత్‌తో గత రెండేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు ఆ మహిళ చెప్పింది. ఈ విషయం ఆమె కుటుంబ సభ్యులకు తెలియడంతో సదరు మహిళ ఆ వ్యక్తిని వదిలించుకోవాలని ఈ హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment