ప్రతీకాత్మక చిత్రం
మైసూరు(బెంగళూరు): ఇద్దరు పిల్లల తల్లి అయిన మహిళను ఆమె కంటే చిన్నవాడైన అర్చకుడు మభ్యపెట్టి తీసుకెళ్లాడు, చివరకు ఆమె అడవిలో ఒంటరిగా ఉండడం చూసి జనం పోలీసులకు సమాచారమిచ్చారు. వివరాలు.. నంజనగూడు తాలూకాలోని కోల్లుపుర గ్రామంలో చోటు చేసుకుంది. బాధిత మహిళ (35) సమస్యలు తొలగిపోవాలని ఆలయానికి వెళ్లేది.
అక్కడి పూజారి సంతోష్ (28) ఆమెను ప్రేమపేరుతో లోబరుచుకున్నాడు. ఇద్దరూ షికార్లకు వెళ్లేవారు. ఇద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోదామని చెప్పి సంతోష్ ఆ మహిళను తీసుకెళ్లి అడవిలో వదిలేసి పారిపోయాడు. స్థానికులు ఆమెను చూసి హుల్లహళ్ళి పోలీసులకు చెప్పగా, వారు ఆమెను రక్షించారు. కేసు నమోదు చేశారు.
చదవండి: తల లేదు.. మొండెం మాత్రమే: క్లూ చెప్పండి, రూ.లక్షలు గెలవండి
Comments
Please login to add a commentAdd a comment