సాక్షి,దుమ్ముగూడెం(ఖమ్మం): మండలంలోని గంగోలు డబుల్ బెడ్‌రూం ఇళ్ల ప్రాంగణంలో ఇద్దరు పురుగుల మందు తాగగా.. ఒకరు మృతి చెందారు. వివాహేతర సంబంధంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ధర్మవరం గ్రామానికి చెందిన తెల్లం గోపాలరావు భార్య సీతమ్మ, ఇద్దరు కుమారులతో కలిసి గంగోలులోని డబల్ బెడ్ రూం ఇంట్లో నివాసముంటున్నాడు. అదే సముదాయంతో తెల్లం నరేష్ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు.
ఈ క్రమంలో సీతమ్మ – నాగరాజు నడుమ వివాహేతర ఏర్పడగా, పలుమార్లు గొడవలు జరిగినట్లు సమాచారం. దీంతో ఇక కలిసి ఉండలేమని భావించిన వారు బుధవారం తెల్లవారుజామున 3గంటలకు ఇళ్ల నుంచి బయటకు వచ్చి పురుగుల మందు తాగారు. ఆ వెంటనే సీతమ్మ మృతి చెందగా ప్రాణా పాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న నాగరాజును భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి భర్త గోపాలరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ దోమల రమేష్ తెలిపారు.
చదవండి: మొదటి సారి దొంగతనం, అంతా అనుకున్నట్లే జరిగింది.. కానీ చివరిలో..
Comments
Please login to add a commentAdd a comment