ప్రేయసితో ఏకాంతంలో దొరికాడు.. అలా నగ్నంగానే ఊరేగించిన భార్య | Chattisgarh Wife Paraded Husaband His Lover Over Affair | Sakshi
Sakshi News home page

ప్రేయసితో ఏకాంతంలో దొరికాడు.. అలా నగ్నంగానే ఊరంతా తిప్పి శిక్షించిన భార్య

Published Tue, Jun 14 2022 7:31 PM | Last Updated on Wed, Sep 28 2022 2:17 PM

Chattisgarh Wife Paraded Husaband His Lover Over Affair - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

అప్పటికే పెళ్లయిన ఓ వ్యక్తి.. ప్రియురాలితో కలిసి ఏకాంతంగా గడుపుతున్న టైంలో రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికాడు. ఆ వివాహేతర సంబంధాన్ని రచ్చకీడ్చే ఉద్దేశంతో.. వాళ్లిద్దరినీ అలా నగ్నంగానే బయటకు ఇడ్చుకొచ్చింది అతని భార్య. ఆపై ఊరంతా తిప్పి.. వాళ్లను ఘోరంగా అవమానించింది.

ఛత్తీస్‌గఢ్‌ కొండాగావ్‌కు చెందిన ఓ వ్యక్తి(25).. స్థానికంగా మరో యువతి(19)తో వివాహేతర సంబంధం నడుపుతున్నాడు. ఈ క్రమంలో గత శనివారం భార్య(23) ఊరెళ్లిందనుకుని.. ఇంట్లోనే దుకాణం పెట్టాడు ఆ వ్యక్తి. సరిగ్గా అదే సమయంలో ఆమె తిరిగి వచ్చింది. వాళ్లిద్దరి భాగోతాన్ని చూసి షాక్‌ తింది. 

అంతటితో ఆగకుండా వాళ్లకు దుస్తులు వేసుకునే టైం కూడా ఇవ్వలేదు. చుట్టుపక్కల వాళ్ల సాయంతో అలాగే నగ్నంగా బయటకు ఈడ్చుకొచ్చింది. ఆపై గ్రామ పెద్దల సహకారంతో ఆ భర్తను, అతని ప్రేయసిని చేతులు వెనక్కి కట్టేయించి నగ్నంగా ఊరేగించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు వాట్సాప్‌ గ్రూపుల్లో విపరీతంగా వైరల్‌ అయ్యాయి. 

జూన్‌ 11వ తేదీన ఈ ఘటన జరగ్గా.. ఉరిందాబెద పోలీసులు రంగంలోకి దిగారు. పోలీస్‌ టీంను ఆ గ్రామానికి పంపించి.. ఘటనకు సంబంధించి వివరాలు సేకరించారు. బాధితుల స్టేట్‌మెంట్‌ల ప్రకారం.. ఫిర్యాదు నమోదు చేసుకున్నారు. ఆపై సదరు వ్యక్తి భార్యతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement