paraded in village
-
హిమాచల్‌లో దారుణం.. కోడలి జుట్టు కత్తిరించి, ముఖానికి నల్లరంగు పూసి
హిమాచల్ ప్రదేశ్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. 21 ఏళ్ల మహిళ జుట్టు కత్తిరించిన అత్తమామలు ఆమెను తీవ్రంగా వేధించారు. కోడలు ముఖానికి నల్లరంగు పూసి గ్రామంలో ఊరేగించారు. హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖ సొంత జిల్లా హమీర్‌పూర్‌లోని భోరంజ్ సబ్‌డివిజన్‌లోని ఓ గ్రామంలో ఆగస్టు 31 జరిగిన ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసుంది. అత్తమామల దాష్టీకానికి సంబంధించిన మూడు నిముషాల వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి అత్తమామలతో సహా అయిదుగురిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల మేరకు.. మహిళకు కొన్నాళ్ల క్రితం వివాహామైంది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆమె తన ఇంటికి వెళ్లింది. అయితే ఆమె తిరిగి రాగానే అత్తమామలు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టారు. కోడలికి వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో అత్తమామలు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అత్తమామలపై కేసు ఫైల్ చేసి చర్యలు తీసుకుంటున్నామని హమీర్పూర్ ఎస్పీ ఆకృతి శర్మ తెలిపారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేశామని, తదుపరి విచారణ జరుగుతోందని ఆమె తెలిపారు. ఈ ఘటన దురదృష్టకరమని హిమాచల్ ప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ప్రబోధ్ సక్సేనా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిందని, కేసును విచారిస్తున్న అధికారులు పూర్తి నివేదికను సమర్పించాలని తెలిపారు. ఈ కేసులో బాధిత మహిళ వాంగ్మూలాన్ని తీసుకున్నామని, ఆమెకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వ స్థాయిలో చర్యలు తీసుకుంటామని చెప్పారు. సీఎం సొంత జిల్లాలోనే ఈ ఘటన జరగడంతో ఈ అంశం రాజకీయ విమర్శలకు దారితీసింది. శాంతిభద్రతలు పూర్తిగా స్తంభించాయని హిమాచల్ బీజేపీ కార్యదర్శి నరేంద్ర అత్రి అన్నారు. ఎలాంటి భయం లేకుండా సంఘ వ్యతిరేకులు నేరాలకు పాల్పడుతున్నారని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. मुख्यमंत्री सुखविंदर सुक्खू जी के गृह जिला में मानवता शर्मसार।#जनता_विरोधी_कांग्रेस_सरकार #कांग्रेस_का_कुप्रशासन#Congress #bhoranj#Hamirpur #cmsukkhu #himachal #himachalpradesh pic.twitter.com/g1jQvi0cYk — BJP Himachal Pradesh (@BJP4Himachal) September 15, 2023 -
నగ్నంగా ఊరేగించిన మహిళకు సీఎం భరోసా
జైపూర్: రాజస్థాన్‌లో ఒక మహిళను వివస్త్రను చేసిన సంఘటన విచారణను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌కు అప్పగించామని బాధితురాలి భర్తతో సహా మరో 10 మందిని అరెస్టు చేసినట్లు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తెలిపారు. ఈ సందర్బంగా బాధితురాలికి రూ.10 లక్షల ఆర్ధిక సాయం తోపాటు ఒక ఉద్యోగాన్ని కూడా కల్పిస్తున్నట్లు ప్రకటించారు. మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన సంఘటన మరువక ముందే రాజస్థాన్‌లో అలాంటి మరో సంఘటన చోటు చేసుకుంది. ప్రతాప్‌గఢ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కన మీనా అనే వ్యక్తి తన భార్యకి పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధముందని అనుమానించి పది మంది చూస్తుండగా ఆమెను ఒకపక్క కొడుతూ వివస్త్రను చేసి నగ్నంగా ఊరేగించాడని తెలిపారు. బాధితురాలి అత్తమామలు ప్రోద్బలంతోనే మీనా ఇంతటి దారుణానికి పాల్పడ్డాడని వారు తెలిపారు. సంఘటన వెలుగులోకి రాగానే వీడియో వైరల్ కావడంతో పాటు దీనిపై రాజకీయ రగడ కూడా మొదలవడంతో స్వయంగా ముఖ్యమంత్రే రంగంలోకి దిగారు. కేసు విచారణ బాధ్యతను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌కు అప్పగించారు. అనంతరం ప్రతాప్‌గఢ్ వెళ్లి గర్భవతియైన బాధితురాలిని ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్బంగా అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ.. రాజస్థాన్ బిడ్డ చాలా ధైర్యవంతురాలు, ఆమె అవమానకరమైన బాధను గొప్ప తెగువతో భరించింది. ఆమె ఆర్ధిక, సామాజిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని ఆమెకు రూ.10 లక్షలు ఆర్ధిక సహాయంతో పాటు ఉద్యోగాన్ని కూడా కల్పిస్తున్నామని ప్రకటించారు. ఆమెకు ఎలాంటి సహాయం కావాలన్నా ప్రభుత్వం తరపున అందజేస్తామని కూడా తెలిపారు. #WATCH | After meeting the Pratapgarh assault victim, Rajasthan CM Ashok Gehlot says, "In this case, an SIT has been formed. 11 people have been arrested... I spoke to the victim's family and assured them that justice would prevail... I offered her a government job... And we will… pic.twitter.com/rJQ4mFHbXk — ANI (@ANI) September 2, 2023 ఇది కూడా చదవండి: బాలాసోర్ రైలు ప్రమాదానికి అదే కారణం.. చార్జిషీట్లో సీబీఐ -
ముగ్గురు పిల్లల తల్లిని బెల్ట్‌తో కొట్టి...భర్తని భుజాలపై మోసుకుని వెళ్లేలా శిక్షించారు!
ప్రజలను రక్షించేందుకు పోలీసు వ్యవస్థ ఉన్నప్పటికీ కొన్ని గ్రామాల్లో మహిళలపై దారుణమైన అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. భార్యభర్తల్లో.. ఇద్దరిలో ఎవరి వల్ల అయిన సమస్య ఉంటే పెద్దలకు చెప్పి పరిష్కరించుకోవడమే లేక కోర్టు ద్వారానో సమస్య పరిష్కరించుకోవడం వంటవి చేయాలి. అంతేగానే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఘోరంగా అవమానించి శిక్షించడం వంటివి చేయకూడదు. దీని వల్ల ఇద్దరి జీవితాలు నాశనమవ్వడమే కాకుండా కటకటాల పాలవ్వడం జరుగుతుంది. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి భార్య తప్పుచేసిందని ఆమె పట్ల ఎంత అమానుషంగా ప్రవర్తించాడంటే...వినేందుకు, చూసేందుకు అత్యంత జుగుప్సకరమైన దారుణానికి ఒడిగట్టాడు. వివరాల్లోకెళ్తే...మద్యప్రదేశ్‌లోని ఒక గ్రామంలో గిరిజన మహిళను దారుణంగా హింసించి బహిరంగంగా అవమానించారు. ముగ్గురు పిల్లల తల్లి అయిన ఆ మహిళను పాక్షికంగా బట్టలు విప్పించి.. బెల్ట్‌తోనూ, కొరడాతోనూ దారుణంగా కొట్టి కిందపడేసి హింసించారు. అంతటితో ఆగకుండా బూట్ల దండవేసి అవమానించారు. ఆ తర్వాత ఆమె తన భర్తను భుజాలపై మోసుకుని ఊరంతా తిరిగేలా దారుణమైన శిక్ష విధించారు. ఈ ఘటన దేవాస్ జిల్లాలోని బోర్‌పదవ్ గ్రామంలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే...బోర్‌పదవ్ గ్రామంలోని ఒక వ్యక్తి తన భార్య ఇంట్లోంచి వెళ్లిపోయిందంటూ.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆమె అదే గ్రామంలో తన ప్రియుడి ఇంట్లో కనిపించింది. వివాహమై మరోకరితో సంబంధం పెట్టుకుందన్న కోపంతో అతను బహిరంగంగా తన భార్యను అవమానించి, కొట్టి హింసించాడు. స్థానికులు సైతం ఆమెను రక్షించేందుకు ముందుకు రాలేదు. ఐతే ఒక వృద్ధ జంట ఆ మహిళను రక్షించేందుకు ప్రయత్నించి విఫలమైంది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఆ మహిళను రక్షించి సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు. ఈ ఘటనకు పాల్పడిన సుమారు 12 మంది నిందుతులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ క్రూరమైన ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. In Madhya Pradesh's Dewas district, people brutally beat up a "Tribal Woman" just because she went with her lover. Aren't we living in a free country @ChouhanShivraj ?? What was her fault?? Where is NDA's candidate for President election, Draupadi Murmu?? Why is she SILENT?? pic.twitter.com/o3afyRtW6U — Rajasthan Congress Sevadal (@SevadalRJ) July 4, 2022 (చదవండి: మరో వ్యక్తితో ప్రియురాలి పెళ్లి.. మండపంలోనే ప్రియుడి ఆత్మహత్య) -
ప్రేయసితో ఏకాంతంలో దొరికాడు.. అలా నగ్నంగానే ఊరేగించిన భార్య
అప్పటికే పెళ్లయిన ఓ వ్యక్తి.. ప్రియురాలితో కలిసి ఏకాంతంగా గడుపుతున్న టైంలో రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు. ఆ వివాహేతర సంబంధాన్ని రచ్చకీడ్చే ఉద్దేశంతో.. వాళ్లిద్దరినీ అలా నగ్నంగానే బయటకు ఇడ్చుకొచ్చింది అతని భార్య. ఆపై ఊరంతా తిప్పి.. వాళ్లను ఘోరంగా అవమానించింది. ఛత్తీస్‌గఢ్ కొండాగావ్కు చెందిన ఓ వ్యక్తి(25).. స్థానికంగా మరో యువతి(19)తో వివాహేతర సంబంధం నడుపుతున్నాడు. ఈ క్రమంలో గత శనివారం భార్య(23) ఊరెళ్లిందనుకుని.. ఇంట్లోనే దుకాణం పెట్టాడు ఆ వ్యక్తి. సరిగ్గా అదే సమయంలో ఆమె తిరిగి వచ్చింది. వాళ్లిద్దరి భాగోతాన్ని చూసి షాక్ తింది. అంతటితో ఆగకుండా వాళ్లకు దుస్తులు వేసుకునే టైం కూడా ఇవ్వలేదు. చుట్టుపక్కల వాళ్ల సాయంతో అలాగే నగ్నంగా బయటకు ఈడ్చుకొచ్చింది. ఆపై గ్రామ పెద్దల సహకారంతో ఆ భర్తను, అతని ప్రేయసిని చేతులు వెనక్కి కట్టేయించి నగ్నంగా ఊరేగించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు వాట్సాప్ గ్రూపుల్లో విపరీతంగా వైరల్ అయ్యాయి. జూన్ 11వ తేదీన ఈ ఘటన జరగ్గా.. ఉరిందాబెద పోలీసులు రంగంలోకి దిగారు. పోలీస్ టీంను ఆ గ్రామానికి పంపించి.. ఘటనకు సంబంధించి వివరాలు సేకరించారు. బాధితుల స్టేట్మెంట్ల ప్రకారం.. ఫిర్యాదు నమోదు చేసుకున్నారు. ఆపై సదరు వ్యక్తి భార్యతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. -
వర్షాల కోసం నగ్నంగా బాలికల ఊరేగింపు
దమోహ్(మధ్యప్రదేశ్): ఆధునిక యుగంలోనూ దురాచారాలకు అడ్డుకట్ట పడడం లేదనడానికి ఇది మరో ఉదాహరణ. వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆరుగురు మైనర్ బాలికలతో నగ్నంగా ఊరేగింపు నిర్వహించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం దమోహ్ జిల్లాలో జబేరా పోలీసు స్టేషన్ పరిధిలోని బనియా గ్రామంలో ఆదివారం ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ గ్రామంలో చాలా ఏళ్లుగా వర్షాలు పడక కరువు తాండవిస్తోంది. బాలికలతో నగ్నంగా ఊరేగింపు జరిపిస్తే వరుణ దేవుడు కరుణించి, వర్షాలు కురిపిస్తాడన్న అంధ విశ్వాసంతో గ్రామ పెద్దలు సభ్య సమాజం తలదించుకొనే దురాగతానికి ఒడిగట్టారు. దీనికి సంబంధించిన రెండు వీడియోలు తెరపైకి వచ్చాయి. జిల్లా కేంద్రానికి కేవలం 50 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ దారుణంపై తమకు సమాచారం అందిందని పోలీసులు చెప్పారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించామని, బాధ్యులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నగ్న ప్రదర్శనకు బాధిత బాలికల తల్లిదండ్రులు సైతం అంగీకరించినట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. వర్షాల కోసం కప్పను ఒక దుంగకు కట్టి, గ్రామంలో ఊరేగించడం చాలామందికి తెలిసిందే. బనియా గ్రామంలో బాలికలను నగ్నంగా మార్చి, వారితో కప్ప ఊరేగింపు నిర్వహించారని దమోహ్ జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ ఉదంతంపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై నివేదిక ఇవ్వాలని దమోహ్ జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. -
కూతురికి గుండు చేసి.. ముఖానికి నల్లరంగు పూసి..
అప్పటికే పెళ్లయిన తమ కూతురు ఎవరితోనో లేచిపోయిందని.. ఆమెకు గుండు గీయించి ముఖానికి నల్లరంగు పూసి.. గ్రామ వీధుల్లో ఊరేగించారు ఆమె తల్లిదండ్రులు. పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో ఈ ఘోరం జరిగింది. వేరే గ్రామానికి చెందిన వ్యక్తిని ప్రేమించి, అతడితో వెళ్లిపోయి పెళ్లి చేసుకున్న యువతి.. వారం రోజుల తర్వాత మళ్లీ తిరిగి వచ్చింది. దాంతో ఆమె తండ్రి, భర్త, సవతి తల్లి కలిసి ఆమెను చిత్రహింసలు పెట్టి, తర్వాత పంచాయతీ వద్ద హాజరుపరిచారు. కుటుంబానికి పరువునష్టం కలిగించినందుకు ఆమెకు ఈ శిక్ష విధించాలని పంచాయతీ పెద్దలు తీర్పు చెప్పారు. దాంతో ఆమె తల్లిదండ్రులు ఆమెకు గుండు గీయించి, ముఖానికి నల్లరంగు పూసి గ్రామంలో ఊరేగించారు. ఈ ఘటనలో యువతి కుటుంబానికి చెందిన 10 మందిపై కేసు నమోదు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి ఎహసాన్ సాదిక్ తెలిపారు. పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో పరువు హత్యల లాంటివి చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నారని ఇద్దరు గర్భిణులను గత వారం దారుణంగా హతమార్చారు.