
హైదరాబాద్: ప్రియుడితో ఓ మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుని.. ఏకంగా అడ్డుగా ఉన్న భర్తను చంపేందుకు పన్నాగం పన్నింది. ఈ సంఘటన హైదరాబాద్ చింతలకుంటలో జరిగింది. చింతలకుంటలో నివాసం ఉండే హరిత, భాస్కర్ పదేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు పుట్టాక దారి తప్పి.. వెంకటేష్ అనే పక్కింటి వ్యకితో ప్రేమాయణం సాగించింది. అప్పటి నుంచి భర్త అడ్డు తొలగించే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 17 నుంచి హరిత కనిపించకుండా పోయింది. హరిత కనిపించకపోవడంతో భర్త భాస్కర్ పొలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నెల 17న వెంకటేష్‌తో కలిసి తిరుపతికి పారిపోయిన హరిత.. నెల 16న హరిత మజ్జిగలో నిద్రమాత్రలు కలిపి భర్తకు ఇచ్చింది.
అతడు నిద్రలోకి జారిపోయాక వాట్సాప్ లో మెసేజ్ పెట్టి ప్రియుడితో కలిసి తిరుపతికి పారిపోయింది. భార్య కనిపించకపోవడంతో భాస్కర్ ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అందులో వెంకటేష్ మీద అనుమానం వ్యక్తం చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలతో ఇరువురిని తిరుపతిలో గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకుని నగరానికి తరలించారు. విచారణ నేపథ్యంలో వీరి మధ్య ఉన్న వివాహేతర సంబంధం, భాస్కర్ హత్యకు కుట్ర తదితరాలు వెలుగులోకి వచ్చాయి.ఈ విషయంపై స్పందించిన వెంకటేష్ భార్య.. మీడియాతో మాట్లాడుతూ తన భర్తను కావాలనే ఈ కేసులో ఇరికించారని చెప్పారు. హరిత డబ్బుకోసమే ఈ పని చేసిందని, ఆమె భర్తకు ఈ విషయం తెలుసని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment