శవాన్ని బయటకు తీయించి విచారిస్తున్న వనపర్తి పోలీసులు. (ఇన్‌సెట్‌లో) బాలస్వామి (పైల్)
వనపర్తి క్రైం: పెళ్లి ఇష్టం లేని యువతి ‘సర్‌ప్రైజ్.. కళ్లుమూసుకో..’ అంటూ కాబోయేవాడి గొంతు కోసేసింది. ఇది సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తుండగానే.. ఓ మహిళ తన భర్తను ఇలాగే ‘సర్‌ప్రైజ్’ చేసింది. ఇంట్లో ఏమీ బాగోలేదు.. గ్రామదేవతకు కోడి పుంజును బలి ఇద్దామని భర్తకు చెప్పింది. అదీ అర్ధర్రాతి బలిస్తే మంచిదని నమ్మిం చి ఒక్కడినే పంపించింది. అప్పటికే అక్కడ తన ప్రియుడిని, సుపారీ గ్యాంగ్‌ను సిద్ధంగా ఉంచింది. భర్తను చంపి పాతి పెట్టించింది. పొలం అమ్మితే వచ్చిన రూ.30 లక్షలు తీసుకుని ప్రియుడితో వెళ్లి పోయింది. 3 నెలలైంది.. ఇంట్లో ఆయన, ఆమె లేరు. ఏమైందో ఎవరికీ తెలియదు.. వనపర్తి జిల్లా కేంద్రంలో జరిగిన ఈ మిస్టరీ తాజాగా బయ టపడింది. స్థానిక సీఐ ప్రవీణ్‌కుమార్ ఈ వివరాలు వెల్లడించారు.
(చదవండి: హాస్టల్‌లో విద్యార్థుల బీర్ల విందు! వాట్సాప్ గ్రూపుల్లో ఫొటోలు వైరల్)
వివాహేతర సంబంధంతో..
వనపర్తిలోని గాంధీనగర్‌కు చెందిన మేస్త్రీ బాలస్వామి (39)కి లావణ్యతో పదేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఓ కుమారుడు, కూతురు ఉన్నా రు. మదనాపురం మండలం దంతనూర్‌కు చెందిన నవీన్ అనే యువకుడికి లావణ్యతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. దీనిపై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగాయి. 5 నెలల క్రితం బాలస్వామి పొలం అమ్మడంతో రూ.30 లక్షలు వచ్చాయి. ఆ డబ్బు తీసుకుని ప్రియుడు నవీన్‌తో వెళ్లిపోవాలని నిశ్చ యించుకుంది. కానీ భర్త మళ్లీ ఎక్కడ అడ్డువస్తాడోనని చంపేయాలని ప్లాన్ చేసుకుంది.
కోడిపుంజు పేరుతో..
వనపర్తి శివారులోని జేరిపోతుల మైసమ్మ గుడి వద్ద అర్ధరాత్రి కోడిపుంజును బలిస్తే మంచి జరుగుతుందని, ఇంట్లో గొడవలు తగ్గుతాయని భర్తను లావణ్య నమ్మించింది. ఈ ఏడాది జనవరి 21న అర్ధరాత్రి ఒక్కడినే మైసమ్మ ఆలయానికి పంపింది. అప్పటికే వేచి ఉన్న నవీన్, సుపారీగ్యాంగ్ కురు మూర్తి, గణేశ్ కలిసి బాలస్వామి గొంతు నులిమి చంపేశారు. కందూరు శివార్లలోని బ్రిడ్జి వద్ద అతడి సెల్‌ఫోన్‌ను పడేశారు. బంగారి అనే వ్యక్తి సాయం తో మృతదేహాన్ని హైదరాబాద్‌లోని బాలాపూర్ శివారుకు తీసుకెళ్లి పాతిపెట్టారు.
హత్య బయటపడిందిలా?
బాలస్వామి కనిపించకపోవడం, ఫోన్ లిఫ్ట్ చెయ్య కపోవడంతో అతడి తమ్ముడు రాజు.. జనవరి 22న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ మర్నాటి నుంచి లావణ్య కూడా కనిపించకుండా పోయింది. దీంతో లావణ్య, నవీన్‌లను పోలీసులు బుధవారం అదుపు లోకి తీసుకుని ప్రశ్నించడంతో హత్య విషయం బయట పడింది. కురుమూర్తి, గణేశ్, బంగారిలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలాపూర్ శివారులో పూడ్చిపెట్టిన బాలస్వామి మృతదేహాన్ని బయటికి తీయించి పోస్టుమార్టం చేయించారు. హత్యకు సుపారీ గ్యాంగ్ రూ.2 లక్షలు తీసుకున్నట్టు విచారణలో తేలింది.
(చదవండి: ఏం చేస్తున్నావంటూ భార్యకు వాయిస్ మెసేజ్ పెట్టాడని..)
Comments
Please login to add a commentAdd a comment