ప్రియుడితో కలిసి జీవితం పంచుకోవాలని ఎన్నో ఆశలతో కెనడా వచ్చిన ఓ యువతి పోలంలో అస్థి పంజరంగా కనిపించింది. ఆమె మృతదేహాన్ని మంగళవారం భివానీలో పోలీసులు గుర్తించారు. ఈ ఘటన హర్యానాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే?
వివరాల్లోకి వెళితే.. 23 ఏళ్ల నీలం ఐఈఎల్టీఎస్ పరీక్షలో ఉత్తీర్ణురాలైంది. అనంతరం ఉద్యోగం నిమిత్తం కెనడాకు వెళ్లింది. అయితే ఆమె భారత్‌లో ఉండగానే సునీల్ అనే వ్యక్తిని ప్రేమించింది. గత ఏడాది జనవరిలో సునీల్ ఆమెను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి భారత్‌కు రప్పించాడు. నీలం తిరిగి వచ్చిన తర్వాత హఠాత్తుగా ఆమె కనిపించకుండా పోయింది. ఈ క్రమంలో సునీల్ కూడా కొన్నాళ్లు స్థానికంగా కనిపించలేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో నీలం సోదరి రోష్ని గత జూన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు కిడ్నాప్‌గా కేసు నమోదు చేయగా, ఫిర్యాదు చేసిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. కేసులో ఎటువంటి పురోగతి కనిపించకపోవడంతో ఆమె కుటుంబం సభ్యులు హర్యానా హోం మంత్రిని కలిశారు. ఆ తర్వాత కేసును భివానీలోని క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి బదిలీ చేశారు. దీంతో యూనిట్ సునీల్‌ను అరెస్ట్ చేసింది. చివరికి నీలంను కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు సునీల్ అంగీకరించాడని పోలీసులు తెలిపారు. అతను ఆమె తలపై రెండుసార్లు కాల్చి చంపాడని, ఆపై తన నేరాన్ని దాచడానికి ఆమె మృతదేహాన్ని తన పొలంలో పాతిపెట్టాడని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment