కొన్నాళ్లుగా ప్రేమ.. నడిరోడ్డుపై దుస్తులు విప్పించి నగ్నంగా వదిలేసి | Thane Woman Robs Boyfriend, Leaves Him Undressed on Highway | Sakshi
Sakshi News home page

కొన్నాళ్లుగా ప్రేమ.. నడిరోడ్డుపై దుస్తులు విప్పించి నగ్నంగా వదిలేసి

Published Tue, Jul 4 2023 8:22 PM | Last Updated on Tue, Jul 4 2023 9:39 PM

Thane Woman Robs Boyfriend, Leaves Him Undressed on Highway - Sakshi

ముంబై: కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. అయితే తాను అనుకున్న టైం రానే వచ్చింది. వెంటనే మాట్లాడాలని పిలిచి తన స్నేహితులతో తీవ్రంగా కొట్టించడమే గాక.. బాయ్‌ఫ్రెండ్‌ దగ్గరున్న డబ్బు, నగదు లాగేసుకుంది ఓ ప్రియురాలు. అంతటితో ఆగకుండా దుస్తులు విప్పించి నడిరోడ్డుపై అతడిని నగ్నంగా వదిలేసి వెళ్లిపోయింది. బాధితుడిని షాహాపూర్‌లో నివాసం ఉంటున్న బాలాజీ శివ్‌భగత్‌గా పోలీసులు గుర్తించారు. అతను నిర్మాణ వ్యాపారం చేస్తున్నాడు. ఐదుగురు నిందితుల్లో ఇద్దరిని భావికా బోయిర్, నదీమ్ ఖాన్‌లుగా గుర్తించారు.  

మహారాష్ట్రలోని ఠాణే జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివభగత్ గత కొన్నాళ్లుగా ఓ యువతితో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు. జూన్ 28న, తన ప్రియురాలు శివ్‌భగత్‌తో మాట్లాడాలని.. షాహాపూర్‌లోని అట్‌గావ్ హైవేపై సాయంత్రం ప్రాంతంలో రావాలని కోరింది. అయితే, ఆ లేడి కిలేడి అని తెలియని భగత్‌.. ప్రియురాలు చెప్పిన ప్రదేశానికి ఒంటరిగా వెళ్లాడు. ఆమె కోసమని కొన్ని బహుమతులు కూడా తీసుకెళ్లాడు. యువతి అతను మాట్లాడుతుండగా, నలుగురు ఎక్కడి నుంచో వచ్చారు గానీ అకస్మాత్తుగా భగత్‌పై దాడి చేశారు.

అతడి వద్ద ఉన్న బంగారు చైన్‌, ఉంగరాలు లాగేసుకున్నారు. బాలాజీ తెచ్చిన బహుమతులను ఆ యువతి తీసేసుకుంది. ఆ తర్వాత అందులో ఒకడు బాలాజీని బెదిరించి దుస్తులు విప్పించాడు. ఈ తతంగమంతా మరో వ్యక్తి వీడియోలో రికార్డ్‌ చేశాడు. చివరిలో భగత్‌ కళ్లలో కారం కొట్టి అక్కడి నుంచి కారుతో సహా ఉడాయించారు. ఆ యువతి కూడా వారితో పాటే వెళ్లిపోయింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

చదవండి: బండ్లగూడ ప్రమాదం: లైసెన్స్‌ లేదు.. బర్త్‌డే నాడు దోస్తులతో హుషారుగా వెళ్తూ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement