గుడ్‌నైట్‌ టీమ్‌ కాంబినేషన్‌లో లవర్‌.. ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ | Good Night Movie Actor Manikandan Lover Movie First Look Poster Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Lover Movie: లవర్‌ అంటున్న గుడ్‌నైట్‌ టీమ్‌.. ఫస్ట్‌ లుక్‌ అదిరింది!

Published Fri, Dec 1 2023 4:02 PM | Last Updated on Fri, Dec 1 2023 4:39 PM

Good Night Manikandan Lover Movie First Look Out - Sakshi

గుడ్‌నైట్‌ చిత్ర యూనిట్‌ రూపొందిస్తున్న చిత్రం లవర్‌. మిలియన్‌ డాలర్‌ స్టూడియోస్‌, ఎంఆర్‌పీ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా లివ్‌ ఇన్‌ యూట్యూబ్‌ సీరీస్‌ ఫేమ్‌ ప్రభురామ్‌ వియాస్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గుడ్‌నైట్‌ మణికంఠన్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను గురువారం విడుదల చేశారు. మోడరన్‌ లవ్‌ చిత్రం ఫేమ్‌ శ్రీగౌరిప్రియ హీరోయిన్‌గా నటిస్తున్న ఇందులో నటుడు కన్నారవి ముఖ్యపాత్రను పోషిస్తున్నారు.

శ్యాన్‌ రోల్డన్‌ సంగీతాన్ని, శ్రేయాస్‌ కృష్ణ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ.. ప్రపంచంలో తొలి అనుభూతి ప్రేమ అయినప్పటికీ, స్త్రీ, పురుషుల మధ్య సంబంధం అనేది సమస్యలతో కూడినదిగానే ఉంటోందన్నారు. అలా ఈతరం యువత ప్రపంచం, రిలేషన్‌షిప్‌లలో వారు ఎదుర్కొనే సమస్యలు, ప్రేమ అంశాలను ఆవిష్కరించే కథా చిత్రంగా లవర్‌ ఉంటుందన్నారు.

మొత్తం మీద ఇది ఒక రొమాంటిక్‌ ప్రేమకథా చిత్రంగా ఉంటుందని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా లవర్‌ చిత్రాన్ని కమర్షియల్‌ ఎంటర్‌టెయినర్‌ కథా చిత్రంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని చెప్పారు. కాగా చిత్ర టీజర్‌, ట్రైలర్‌ విడుదల కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు.

చదవండి: ఓటీటీని షేక్‌ చేసిన టాప్‌ 10 సిరీస్‌లు అవే.. డిసెంబర్‌లో కొత్తగా 37 సిరీస్‌లు రిలీజ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement