కొత్త కథ... కొత్త క్యారెక్టర్‌ | The second film with Naga Babu's daughter Neharika movie started Friday. | Sakshi
Sakshi News home page

కొత్త కథ... కొత్త క్యారెక్టర్‌

Published Fri, Jun 16 2017 11:36 PM | Last Updated on Tue, Sep 5 2017 1:47 PM

కొత్త కథ... కొత్త క్యారెక్టర్‌

కొత్త కథ... కొత్త క్యారెక్టర్‌

‘ఒక మనసు’ చిత్రంతో తనలో మంచి నటి ఉందని నిరూపించు కున్నారు మెగా బ్రదర్‌ నాగబాబు కుమార్తె నీహారిక. ఆమె లీడ్‌ రోల్‌లో నటిస్తోన్న రెండో చిత్రం శుక్రవారం ప్రారంభమైంది. రవిదుర్గా ప్రసాద్‌ దర్శకత్వంలో ఎం.ఆర్‌. ఎంటర్‌ టైన్మెంట్స్‌–కవిత కంబైన్స్‌ పతాకాలపై మరిసెట్టి రాఘవయ్య, బండారు బాబీ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు మారుతి కెమెరా స్విచ్చాన్‌ చేయగా, హీరో శ్రీకాంత్‌ క్లాప్‌ ఇచ్చారు.

దర్శకుడు మెహర్‌ రమేష్, నాగబాబు గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘ఈశ్వర్‌ రెడ్డి, మెహర్‌ రమేష్, ప్రభుదేవా, రాహుల్‌ బోస్‌ వంటి ప్రతిభావంతుల వద్ద దర్శకత్వ శాఖలో చేసిన రవి దుర్గాని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. సరికొత్త కథాంశంతో సినిమా ఉంటుంది. నీహారిక పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ఈ నెలాఖరులో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమవుతుంది. ‘థర్టీ ఇయర్స్‌’ పృథ్వీ కీలక పాత్రలో నటిస్తున్నారు’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మధు పొన్నాస్, సినిమాటోగ్రఫీ: రాజ్‌ తోట, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: నండూరి రాము.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement