
సక్సెస్‌ఫుల్ వెబ్ సీరీస్ ముద్దపప్పు ఆవకాయతో నటిగా పరిచయం అయిన మెగా డాటర్ నిహారిక, తరువాత యాంకర్, హీరోయిన్‌గా ప్రూవ్ చేసుకుంది. అయితే డిజిటల్ మీడియాలో ఘనవిజయం సాదించిన, నిహారిక వెండితెర మీద మాత్రం సక్సెస్ సాదించలేకపోయింది. దీంతో మరోసారి వెబ్ సీరీస్ లో అలరించేందుకు రెడీ అవుతోంది. తండ్రి నాగబాబుతో కలిసి ‘నాన్న కూచి’ అనే ఫీచర ఫిలిం చేస్తోంది నిహారిక.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ఫిలిం టీజర్‌ను అక్టోబర్ 29 ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన సోషల్ మీడియా ద్వారా ఎనౌన్స్ చేశారు. ఈ ఫిలింలో నాగబాబు, నిహారికలు తండ్రీకూతుళ్లుగా నటిస్తున్నారు.
Trailer of #Nannakoochi series is out on Oct 29th @ 11am!
— Varun Tej (@IAmVarunTej) 28 October 2017
The cutest father daughter duo!
Stay tuned..😁😁😁 pic.twitter.com/x1LKJ3Hae9