-వేడుకలకు హాజరైన హీరోయిన్ నిహారిక, వేణుమాధవ్
నాచారం
తెలంగాణ రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షుడు ఎం.సందీప్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నాచారంలోని సాధన మానసిక వికలాంగుల పాఠశాలలో మెగాస్టార్ చిరంజీవి 61వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాగబాబు కూతురు, హీరోయిన్ నిహారిక, ప్రముఖ హాస్యనటుడు వేణుమాదవ్, కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఇన్‌చార్జీ బండారి లకా్ష్మరెడ్డి, బస్వరాజ్ శ్రీనివాస్ హాజరయ్యారు. మానసిక వికలాంగులైన విద్యార్థుల మధ్య హీరోయిన్ నిహారిక కేక్ కట్ చేసి అందరికీ పంచారు. అనంతరం విద్యార్థులకు అన్నదానం చేశారు. సాధన వృద్ధాశ్రమంలోని వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం పాఠశాల అవరణలో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ... పెద్దనాన్న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను మానసిక వికలాంగుల మద్య జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు అన్నదానం, పండ్ల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు చేయడం చాలా అభినందనీయమన్నారు. సాధన మానసిక వికలాంగుల పాఠశాలను నిర్వహిస్తున్న యాజమాన్యాన్ని నిహారిక అభినందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ ప్రధాన కార్యదర్శి సాయిజెన్ శేఖర్, రాజేష్ గౌడ్, చిరంజీవి అభిమానులు జాఫర్, శ్రీనివాస్‌గౌడ్, సాయి, నిఖిల్, శివ, వెంకటేష్, రవి, మధు, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.