'నిహారికతో పెళ్లా.. ఆ అమ్మాయినే చేసుకుంటా' | young hero naga shourya responded on marriage with niharika | Sakshi
Sakshi News home page

నిహారికతో పెళ్లిపై స్పందించిన యువహీరో

Jan 31 2018 5:33 PM | Updated on Jan 31 2018 6:13 PM

young hero naga shourya responded on marriage with niharika - Sakshi

హీరో నాగశౌర్య

సినీ పరిశ్రమలో రూమర్లకు కొదవలేదు. రోజుకో వార్త తెలుగు సినీపరిశ్రమలో హల్‌చల్‌ చేస్తుంది. అందులో అగ్రహీరోల ఇళ్లలోని వార్తలు అంటే ఇక అంతే. గత కొంతకాలంగా టాలీవుడ్‌లో ఎక్కువగా వినిపిస్తున్న వార్త మెగా బ్రదర్‌, జబర్థస్త్‌ కామెడీ షో ఫేం నాగబాబు కుమార్తె నిహారికా పెళ్లిగురించే. గతంలో రెండుసార్లు నిహారిక పెళ్లి టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌ అయింది. మొదట నిహారిక బావ సాయి ధరమ్‌తేజ్‌ను పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలు హల్‌చల్‌ చేశాయి.

కొద్ది రోజులకు అది వాస్తవం కాదని తేలినా, మరికొద్దిరోజుల కిందట బాహుబలి ప్రభాస్‌తో నిహారిక పెళ్లి అంటూ మరో వార్త వినిపించింది. దీనిపై స్పందించిన రెండుకుటుంబాలు అటువంటిది ఏమీలేదని కొట్టిపడేశాయి. ఇప్పుడు తాజగా మరో వార్త వైరల్‌ అయింది. అతి త్వరలో యువ హీరో నాగ శౌర్యతో నిహారిక వివాహమని, ఇరు కుటుంబ సభ్యుల నడుమ చర్చలు నడుస్తున్నాయని రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. ఇటీవల మెగాస్టార్‌ చిరంజీవి, నాగ శౌర్య నటించిన చిత్రం ‘ఛలో’  ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య ఆతిథిగా హాజరయ్యారు. దీంతో ఈవార్తలు మరింత జోరందుకున్నాయి.

అయితే వీటన్నింటిపై స్పందించిన నాగశౌర్య, నిహారికతో తన పెళ్లి అంటూ వచ్చిన వార్తలను ఖండించారు. తన స్నేహితుల ద్వారా తాను ఈవార్త విన్నానని , వాటిలో ఏమాత్రం నిజం లేదని మరో మూడు లేదా నాలుగేళ్లు వరకూ తనకు పెళ్లి చేసుకొనే ఉద్దేశం లేదని పేర్కొన్నాడు. ప్రస్తుతం తాను సినిమాల్లో బిజీగా ఉన్నానని కేరీర్‌ మీద శ్రద్దపెట్టానని తెలిపాడు. పెళ్లి విషయానికి వస్తే కుటుంబ సభ్యులు చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని వివరణ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement