
సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలంటే జనాలకు చాలా ఇష్టం. వారి పర్సనల్ లైఫ్‌పై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతారు. పెళ్లి చేసుకున్నప్పుడు చప్పట్లు కొట్టడం, విడాకులు తీసుకున్నప్పుడు నోటికొచ్చింది తిట్టేయడం నెటిజన్లకు అలవాటైపోయింది. అటుపక్కన ఉన్నవారు ఎంత బాధపడతారనే విషయం కూడా ఆలోచించడం లేదు. కొందరైతే హద్దులు మీరి మరీ సోషల్ మీడియాలో అసభ్యంగా మాట్లాడుతున్నారు. ఇటీవలి కాలంలో విడాకుల వల్ల ట్రోలింగ్‌కు గురైనవారిలో నిహారిక కొణిదెల ఒకరు.
తొలుత ఆమె చైతన్యతో విడిపోయినట్లు రూమర్స్ వచ్చాయి. ఇద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. తర్వాత ఓ సమయం చూసుకుని ఇద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించారు, విడాకులు తీసుకున్నారు. అయితే నిహారిక విడాకులకు ఆమె వ్యవహార శైలే కారణమని కొందరు లేనిపోని పుకార్లు సృష్టించారు. తనకున్న పబ్ అలవాట్ల వల్లే చైతన్య దూరం పెట్టాడని ఏదేదో రాసేశారు. అంతేకాదు, తనకు యూట్యూబర్ నిఖిల్‌కు లింక్ పెడుతూ వాళ్లను విమర్శించారు. తాజాగా ఆ వార్తలకు పరోక్షంగా ఘాటుగా సమాధానమిచ్చింది నిహారిక. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో నిఖిల్‌కు బర్త్‌డే విషెస్ చెప్పింది.
'యాంకరింగ్ నుంచి సహనటుడిగా మారావు. అక్కడి నుంచి నిర్మాతగా.. తర్వాత నా చిట్టి తమ్ముడిగా మారావు. మనం కలిసి చాలాదూరం ప్రయాణించాం. స్వచ్ఛమైన మనసు ఉన్నవాళ్లు కొందరే ఉంటారు. అందులో నువ్వు ఒకడివి. లవ్ యూ నిక్కు. గ్రేట్ బర్త్‌డే నానా..' అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. దీనికి నిఖిల్ థాంక్యూ నిహా అని రిప్లై ఇచ్చాడు. నిఖిల్ తనకు తమ్ముడిలాంటివాడని పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చేసింది నిహారిక.
Comments
Please login to add a commentAdd a comment