తళుక్కుమన్న తులిప్‌ | Tulip Festival in Hyderabad | Sakshi
Sakshi News home page

తళుక్కుమన్న తులిప్‌

May 10 2019 7:08 AM | Updated on May 10 2019 7:08 AM

Tulip Festival in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: తులిప్‌ పుష్పాలు తళుక్కుమన్నాయి. వైవిధ్యభరితమైన రూపాల్లో కనువిందు చేశాయి. జూబ్లీహిల్స్‌లోని పార్క్‌వ్యూ ఎన్‌క్లేవ్‌లో నిర్వహించిన తులిప్‌ పుష్పాల పండగ అదరహో అనిపించింది. నగరానికి చెందిన ఫ్లోరల్‌ బొటిక్‌ చాంప్స్‌ ఫ్లవర్‌  ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన తులిప్‌ పుష్పాల పండగ చూపరులకు ఆహ్లాదకర అనుభూతిని అందించింది. ఈ సందర్భంగా నిర్వాహకురాలు చిత్రాదాస్‌ లగడపాటి మాట్లాడుతూ.. నగరంలో తొలిసారిగా 10 వేల తులిప్‌ పూల పండగను ఏర్పాటు చేయడం సంతోషాన్ని అందించిందన్నారు. ఈ పూలు ఉద్యానాలతో పాటు ఇంటికీ అందాన్ని పెంచుతాయంటూ.. వాటి గురించిన విశేషాలను సందర్శకులకు వివరించారు. ఫ్లవర్‌ ఫెస్ట్‌ని సందర్శించిన వారిలో ప్రముఖ సినీనటి నిహారిక, సిటీ సోషలైట్స్‌ పద్మా రాజగోపాల్, పద్మజారెడ్డి, మంజులారెడ్డి, జ్యోత్స్న, కామిని షరాఫ్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement