నిహారికను చెల్లెలిగా భావిస్తా: సాయిధరమ్
హైదరాబాద్: వరుసకు మరదలైన నటుడు నాగబాబు కుమార్తె నిహారికతో తనకు త్వరలో వివాహం జరగనుందని వచ్చిన వార్తలను హీరో సాయిధరమ్ తేజ్ ఖండించారు. నిహారికను తాను చెల్లెలిగా భావిస్తానని చెప్పారు. ఈ మేరకు ఆయన తన ప్రతినిధితో ఓ ప్రకటన విడుదల చేశారు. నిహారికను పెళ్లి చేసుకోబోతున్నట్లు వచ్చిన వార్తలు తనను బాధించాయని తెలిపారు.
చిన్నతనం నుంచి ఒకే కుటుంబలో కలిసిమెలిసి పెరిగామని ఒకరినొకరం అన్నాచెల్లెళ్లుగా భావిస్తామని వివరించారు. ఒక అమ్మాయికి సంబంధించిన సున్నితమైన వార్తలను ఇచ్చే ముందు ధ్రువీకరించుకోవాలని కోరారు. ఆధారం లేని వార్తలు ఎదుటివారి మనో భావాలను దెబ్బతీస్తాయని చెప్పారు.