ప్రపంచ జూనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు కనీసం రెండు కాంస్య పతకాలు ఖాయమయ్యాయి.
ప్రపంచ జూనియర్ బాక్సింగ్
తైపీ : ప్రపంచ జూనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు కనీసం రెండు కాంస్య పతకాలు ఖాయమయ్యాయి. హర్యానా బాక్సర్ సోనియా సాక్షి (48 కేజీలు), తెలంగాణ బాక్సర్ గొన్నెల నిహారిక (70 కేజీలు) తమ విభాగాల్లో సెమీఫైనల్‌కు చేరుకొని పతకాలను ఖాయం చేసుకున్నారు.
క్వార్టర్ ఫైనల్లో సాక్షి 3-0తో సెరికోవా జానా (కజకిస్తాన్)పై గెలుపొందగా... నిహారికకు నేరుగా ‘బై’ లభించింది. నిహారిక సోదరి గొన్నెల నాగనిక (+ 80 కేజీలు)తోపాటు భారత్‌కే చెందిన సవిత (50 కేజీలు), మన్‌దీప్ కౌర్ (52 కేజీలు), నిషా (60 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు.