World Junior Boxing
-
భారత్‌కు మూడు స్వర్ణాలు
►నీహారికకు రజతం ►ప్రపంచ జూనియర్ బాక్సింగ్ తైపీ : అంచనాలకు మించి రాణించిన భారత అమ్మాయిలు ప్రపంచ జూనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో మూడు స్వర్ణాలు, రెండు రజత పతకాలు సాధించారు. శనివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో సవిత (50 కేజీలు), మన్దీప్ సంధూ (52 కేజీలు), సాక్షి (54 కేజీలు) పసిడి పతకాలు నెగ్గగా... తెలంగాణ బాక్సర్ గోనెల్ల నీహారిక (70 కేజీలు)తో పాటు సోనియా (48 కేజీలు) రజత పతకాలతో సంతృప్తి పడ్డారు. ఇదే వేదికపై జరిగిన ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో జమునా బోరో (57 కేజీలు) కాంస్య పతకాన్ని సాధించింది. దోహాలో మరో నాలుగు స్వర్ణాలు న్యూఢిల్లీ: దోహా అంతర్జాతీయ టోర్నీలో భారత బాక్సర్లు మెరిశారు. శనివారం జరిగిన ఈవెంట్లో నాలుగు స్వర్ణాలు, ఓ రజతం, రెండు కాంస్యాలు దక్కాయి. ఎల్.దేవేంద్రో సింగ్ (49కేజీ), శివ థాపా (56కేజీ), మనీష్ కౌశిక్ (60కేజీ), మనోజ్ కుమార్ (64కేజీ) స్వర్ణాలు గెలుచుకోగా గౌరవ్ బిధూరి (52కేజీ) రజతం, మన్దీప్ జాన్‌గ్రా (69కేజీ), వికాస్ క్రిషన్ (75కేజీ) కాంస్యాలు సాధించారు. అక్టోబర్‌లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్స్‌కు సన్నాహకంగా ఈ టోర్నీ జరుగుతోంది. -
పసిడి పోరుకు నీహారిక
►మరో నలుగురు కూడా ►ప్రపంచ జూనియర్ బాక్సింగ్ తైపీ: భారత అమ్మాయిలు తమ పంచ్ పవర్‌తో ప్రపంచ జూనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో అదరగొట్టారు. ఐదు విభాగాల్లో ఫైనల్‌కు చేరుకొని కనీసం ఐదు రజతాలను ఖాయం చేసుకున్నారు. 70 కేజీల విభాగంలో తెలంగాణ బాక్సర్ గోనెల్ల నీహారికతోపాటు సోనియా (48 కేజీలు), సవిత (50 కేజీలు), మన్దీప్ సంధూ (52 కేజీలు), సాక్షి (54 కేజీలు) పసిడి పోరుకు అర్హత సాధించారు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్‌లో నిహారిక పంచ్‌ల వర్షం కురిపించి తన ప్రత్యర్థి యు యువాన్ (చైనా)ను రెండో రౌండ్లో నాకౌట్ చేసింది. శనివారం జరిగే ఫైనల్స్‌లో అనస్తాసియా సిగయెవా (రష్యా)తో నీహారిక తలపడుతుంది. -
నిహారికకు పతకం ఖాయం
ప్రపంచ జూనియర్ బాక్సింగ్ తైపీ : ప్రపంచ జూనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు కనీసం రెండు కాంస్య పతకాలు ఖాయమయ్యాయి. హర్యానా బాక్సర్ సోనియా సాక్షి (48 కేజీలు), తెలంగాణ బాక్సర్ గొన్నెల నిహారిక (70 కేజీలు) తమ విభాగాల్లో సెమీఫైనల్‌కు చేరుకొని పతకాలను ఖాయం చేసుకున్నారు. క్వార్టర్ ఫైనల్లో సాక్షి 3-0తో సెరికోవా జానా (కజకిస్తాన్)పై గెలుపొందగా... నిహారికకు నేరుగా ‘బై’ లభించింది. నిహారిక సోదరి గొన్నెల నాగనిక (+ 80 కేజీలు)తోపాటు భారత్‌కే చెందిన సవిత (50 కేజీలు), మన్దీప్ కౌర్ (52 కేజీలు), నిషా (60 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు.