ఒక మనసు కోసం? | oka manusu cinema special | Sakshi
Sakshi News home page

ఒక మనసు కోసం?

Published Fri, May 27 2016 12:02 AM | Last Updated on Mon, Sep 4 2017 12:59 AM

ఒక మనసు కోసం?

ఒక మనసు కోసం?

మెగాబ్రదర్స్‌లో ఒక్కరైన నాగేంద్రబాబు కుమార్తె నీహారిక ‘ఒక మనసు’ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమవుతున్న విషయం తెలిసిందే. ఇందులో నాగశౌర్యతో ఆమె జతకట్టారు. మధుర ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామరాజు దర్శకత్వంలో ‘మధుర’ శ్రీధర్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 24న విడుదలవుతోంది. నిర్మాత మాట్లాడుతూ- ‘‘మెగా హీరోల చేతుల మీదుగా ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది.


సినిమా ఫస్ట్ లుక్ నుంచి ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు అనూహ్య స్పందన రావడం ఆనందంగా ఉంది’’ అని చెప్పారు. ‘‘ప్రేమ, కుటుంబం, బాధ్యతలు వంటి విలువలను ఈ చిత్రంలో చూపించాం. నాగశౌర్య, నీహారిక నటన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ప్రతి మనసుని ఈ చిత్రం అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అని దర్శకుడు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement