
గువాహటి: ఆతిథ్య భారత్‌కు ప్రపంచ మహిళల యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పోటీలు ప్రారంభంకాకముందే రెండు పతకాలు ఖాయమయ్యాయి. ఆదివారం మొదలయ్యే ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించిన ‘డ్రా’ను శనివారం తీశారు. ప్లస్ 81 కేజీల విభాగంలో నేహా యాదవ్... 81 కేజీల విభాగంలో అనుపమలకు నేరుగా సెమీఫైనల్లోకి ‘బై’ లభించింది.
దాంతో వీరిద్దరికి కనీసం కాంస్య పతకాలు లభిస్తాయి. మరోవైపు 75 కేజీల విభాగంలో తెలుగమ్మాయి గోనెళ్ల నిహారికకు తొలి రౌండ్‌లో ‘బై’ లభించింది. క్వార్టర్ ఫైనల్లో నిహారిక ప్రత్యర్థిగా జార్జియా ఒకానర్ (ఇంగ్లండ్) లేదా యు జియటెంగ్ (చైనా) ఉండే అవకాశముంది. భారత్‌కే చెందిన జ్యోతి (51 కేజీలు), నీతూ (48 కేజీలు)లకు కూడా తొలి రౌండ్‌లో ‘బై’ లభించింది.
Comments
Please login to add a commentAdd a comment