
నటి స్నేహ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన సహజ నటనతో తెలుగు, తమిళం తదితర భాషల్లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళంలో కమలహాసన్, విజయ్, అజిత్, ధనుష్ వంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేశారు. తెలుగలోనూ నాగార్జున, వెంకటేష్, రవితేజ వంటి ప్రముఖ నటుల సరసన నటించారు. నటుడు ప్రసన్నకు జంటగా అచ్చముండు అచ్చముండు చిత్రంలో నటించారు.
భర్త ప్రసన్నతో స్నేహ
ఆ సమయంలోనే వారి మధ్య పరిచయం ప్రేమగా మారింది. కొన్నాళ్లు తమ మధ్య ప్రేమను రహస్యంగా ఉంచిన ఈ జంట చివరకు 2012లో పెళ్లి పీటలు ఎక్కారు. వీరికి ఇద్దరు పిల్లలు. వివాహానంతరం స్నేహ నటనను కొనసాగిస్తున్నారు. అలా ప్రసన్న, స్నేహల దాంపత్య జీవితం సంతోషంగా సాగుతోంది. అలాంటిది రెండు నెలలుగా వీరి మధ్య మనస్పర్థలు తలెత్తాయని, వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
అయితే అదంతా అబద్ధమని స్నేహ సన్నిహితులు కొట్టిపారేశారు. ఈ వదంతులకు ఇదే తమ సమాధానం అన్నట్లు ప్రసన్న, స్నేహ ప్రత్యేకంగా ఫొటో షూట్ నిర్వహించి దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేశారు. ఆ ఫొటోల్లో స్నేహ ఇప్పటికీ తాను హీరోయిన్‌నే అన్నట్లుగా కొత్త అందాలతో మెరిసిపోతోంది.
Comments
Please login to add a commentAdd a comment