కాదంటే అవుననిలే...అనే సూపర్ హిట్ పాట ఉంది కదా. ఇప్పుడు నటుడు సిద్ధార్థ్, నటి అతిథి రావ్ హైదరి పరిస్థితి ఇలానే ఉంది. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతారు. సినీ వివాహ వేడుకల్లో తళుక్కున మెరుస్తూ ఫొటోగ్రాఫర్లకు ఫోజులిస్తారు. లవ్వా అంటే చా..చా... అలాంటిదేమీ లేదు....మంచి స్నేహితులం అంటారు. మీడియాలో మాత్రం సిద్ధార్థ్, అతిథి రావ్ హైదరి సహజీవనం అంటూ వార్తలు హల్‌చల్ చేస్తుంటాయి.
ఈ సంచలన జంట గురించి కొంచెం వెనక్కి వెళ్లి చూస్తే శంకర్ దర్శకత్వం వహించిన బాయ్స్ చిత్రం ద్వారా నటుడిగా పరిచయం అయిన నటుడు సిద్ధార్థ్. మణిరత్నం దర్శకత్వం వహించిన కాట్రు వెలియిడై చిత్రంతో కోలీవుడ్‌కు అతిథి రావ్ హైదరి పరిచయం అయ్యింది. అయితే వీరిద్దరూ కలిసి తెలుగులో సముద్రం అనే చిత్రంలో నటించారు. ఆ చిత్రం ప్లాప్ అయినా వీరి మధ్య పరిచయం బలపడిందంటారు.
మరో విషయం ఏంటంటే సిద్ధార్థ్‌కి ఇప్పటికే పెళ్లి, విడాకులు కావడం జరిగిపోయింది. నటి అతిథి రావ్ హైదరిదీ ఇదే పరిస్థితి. దీంతో ఈ జంట ముచ్చట చూసి ప్రేమలో ఉన్నారని, పెళ్లికి రెడీ అవుతున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. కాగా తాజాగా వీరిద్దరూ కలిసి ఒక పాటకు చేసిన డాన్స్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోనున్నారనే ప్రచారం కూడా జోరుగా సాగుతంది. అయితే దీనిపై వాళ్లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.
కాదు.. లేదు అంటూనే!
Published Sun, Apr 9 2023 2:12 AM | Last Updated on Sun, Apr 9 2023 7:22 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment