యష్మికి హింట్‌ ఇచ్చిన తండ్రి.. ఆ తప్పు చేయొద్దంటూ.. | Bigg Boss 8 Telugu: Yashmi Father Give Hints to Her | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 8: కూతురి తరపున క్షమాపణలు చెప్పిన యష్మి తండ్రి..

Published Wed, Nov 13 2024 4:29 PM | Last Updated on Wed, Nov 13 2024 4:49 PM

Bigg Boss 8 Telugu: Yashmi Father Give Hints to Her

మగళై.. ఈ పదం వింటే చాలు యష్మి ఒళ్లు పలకరించిపోతుంది. తండ్రి తనను ముద్దుగా మగళై అని పిలుస్తాడని యష్మి చెప్పినప్పుడు ఆమె ముఖం వెయ్యి వోల్టుల బల్బులా వెలిగింది. తండ్రి పంపిన లెటర్‌ కొన్ని క్షణాలపాటు కళ్లముందు కనిపించి మాయమైనప్పుడు కన్నీళ్ల వరద పారింది. అలాంటిది తండ్రి తన కళ్లముందుకు నడుచుకుంటూ వస్తే.. ?

ఆనందభాష్పాలు
ఫ్యామిలీ వీక్‌లో భాగంగా యష్మి తండ్రి హౌస్‌లో అడుగుపెట్టాడు. అతడిని చూడగానే యష్మిలో ఎమోషన్స్‌ కట్టలు తెంచుకున్నాయి. పప్పా అని గట్టిగా అరిచి నాన్నను ఆప్యాయంగా హత్తుకుంది. ఆయన కూడా కూతుర్ని దగ్గరకు తీసుకుని తన తప్పులు సరిదిద్దుతూ కొన్ని హింట్లు ఇచ్చాడు ఇండివిడ్యువల్‌ గేమ్‌ ఆడు.. బయట బ్యాడ్‌ అవుతున్నావు. నువ్వు ఇన్నిరోజులు ఉండి ఇంతవరకు వచ్చావు.. నిన్ను ఫినాలే స్టేజీపై చూడాలనుంది అని చెప్పాడు. 

కూతురి తరపున సారీ
హౌస్‌మేట్స్‌తో కూడా.. నా కూతురు ఆవేశంలో ఏమైనా అంటే తప్పుగా తీసుకోకండి.. అని కోరాడు. కూతురి కోసం తండ్రి క్షమాపణ చెప్పడం చూసి నెటిజన్లు సైతం ఎమోషనల్‌ అవుతున్నారు. ఎంతైనా తండ్రీకూతుర్ల అనుబంధం అన్నింటికంటే గొప్పదని కామెంట్లు చేస్తున్నారు.

 

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement