సీరియల్స్‌తో అల్లాడించిన యష్మి గౌడ పుట్టి పెరిగిందంతా బెంగళూరులోనే. తనకేమో నటన అంటే ఇష్టం. ఇంట్లోవాళ్లకేమీ నచ్చేది కాదు. అయినా ఓ కన్నడ ఛానల్‌లో ఏదో సీరియల్‌కు ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి ఆశగా వెళ్లింది. ఫస్ట్ ఆడిషన్‌లోనే ఎంపికైంది. అలా తన కెరీర్ మొదలైంది. స్వాతి చినుకులు సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. లాక్‌డౌన్ సమయంలో నాగభైరవిలో నటించే అవకాశం వచ్చింది.
కృష్ణ ముకుంద మురారి ధారావాహికతో బుల్లితెర ప్రేక్షకులకు మరింత నచ్చేసింది. కన్నడలో ఓ మూవీలోనూ యాక్ట్ చేసిన ఈ బ్యూటీకి సిరామిక్ పాత్రలు, మగ్గులు, కప్పులు తయారుచేసే బిజినెస్ కూడా ఉంది. తెలుగు సినిమాల్లో నటించాలని కలలుగంటున్న యష్మి బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్‌లో ఫస్ట్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. వచ్చీరావడంతోనే నాగ్‌కు పూలు ఇచ్చి బుట్టలో పడేసే ప్రయత్నం చేసింది. ఫుల్ జోష్ మీదున్న ఈ బ్యూటీ పన్నెండో వారం ఎలిమినేట్ అయింది.
Comments
Please login to add a commentAdd a comment