
వైల్డ్‌కార్డులు వచ్చినప్పటినుంచి ప్రతి టాస్కు గెలుస్తూ పాత కంటెస్టెంట్లపై పైచేయి సాధించారు. మెగా చీఫ్ పోస్టును కూడా రెండువారాలపాటు తమదగ్గరే ఉంచేసుకున్నారు. ఇప్పుడు ఓజీ(పాత కంటెస్టెంట్లు) టీమ్ వంతు వచ్చింది. టాస్కులు భయంకరంగా ఆడి గెలిచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ టాస్కు ఫలితాల్లో గౌతమ్‌కు ఏదో తేడా కొట్టి ప్రేరణతో మాట్లాడాడు.

ఇక్కడి నుంచి వెళ్లిపో
మీరేమైనా చేసుకోండి.. కానీ ముందు నేను చెప్పే పాయింట వినండి అని ప్రేరణతో మాట్లాడుతున్నాడు. ఇంతలో యష్మి మధ్యలో దూరడంతో గౌతమ్ ఆగ్రహించాడు. మా ఇద్దరి మధ్యలోకి ఎందుకు వస్తున్నావు? ఇక్కడి నుంచి వెళ్లిపో.. అని అరవడంతో యష్మి సైలెంట్‌గా అక్కడి నుంచి జారుకుంది.
ఆటలోనే భరించలేము
ఇక చీఫ్ కంటెండర్లు కావాలంటే కండబలం, బుద్ధిబలం ఉపయోగించేలా టాస్కులు పెట్టిన బిగ్‌బాస్ చీఫ్ పోస్టుకు మాత్రం బలమైన టాస్క్ రాసుకోనేలేదు. హౌస్‌మేట్స్ నిర్ణయానికే వదిలేశాడు. పృథ్వీని ఆటలోనే భరించలేము, చీఫ్‌గా వారమంతా భరిస్తామా? అని హరితేజ అభిప్రాయపడింది. మొత్తానికి విష్ణుప్రియ ఈ వారం మెగా చీఫ్‌గా నిలిచింది.