
మెగా చీఫ్ అవడానికి కంటెండర్లకు బిగ్‌బాస్ మరో టాస్క్ ఇచ్చాడు. అదే తెడ్డు మీద గ్లాస్. ఓ తెడ్డుపై నీళ్ల గ్లాసుల్ని తీసుకెళ్లి అవతల ఒడ్డుకు తీసుకెళ్లి కంటైనర్లు నింపుకోవాలి. మొదట అందరూ ఎవరి ఆటపై వారు దృష్టి సారించారు. అయితే విష్ణుప్రియ.. అవతలివారు ఆటలో ముందుకు పోకుండా తన తెడ్డుతో ఆ గ్లాసుల్ని పడగొట్టింది.

గలీజ్ గేమ్
దీంతో యష్మి.. ఇలా గలీజ్ ఆట ఆడాలంటే మొదటి నుంచే ఆడొచ్చు అని అసహనానికి లోనైంది. ఇక ఇప్పటివరకు పెట్టిన గేమ్స్‌లో ఎక్కువ పాయింట్లు తెచ్చుకున్న ముగ్గురికీ చివరి టాస్క్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఆ టాస్క్‌లో తేజ, పృథ్వీ, రోహిణి పాల్గొన్నారు. ఇసుక కూజాల్ని కింద పడకుండా హోల్డ్ చేయాలి. ఈ గేమ్‌లో తేజ ఓడిపోగా చివర్లో పృథ్వీ, రోహిణి మిగిలారు.

పృథ్వీని ఓడించిన రోహిణి
నువ్వు పరిగెత్తగలవా? అంటూ హేళన చేసిన పృథ్వీపై రోహిణి విజయం సాధించి మెగా చీఫ్ అయినట్లు సమాచారం. ఇది తెలిసిన అభిమానులు దెబ్బ అదుర్స్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ పరాభవాన్ని పృథ్వీ తట్టుకుంటాడా? తన ఇగో హర్ట్ అయిందా? అనేది ఎపిసోడ్‌లో చూడాలి!
Comments
Please login to add a commentAdd a comment