బిగ్‌బాస్ షోలో లవ్ ట్రాక్స్ కామన్. కానీ ఈ సీజన్ విచిత్రంగా అమ్మాయి వెంటపడుతుంటే అబ్బాయి పట్టింపు లేనట్లు కూర్చున్నాడు. ఆ జంటే విష్ణుప్రియ- పృథ్వీ. నాకంటే కూడా నాకు నువ్వే ఎక్కువ అంటూ వీలు కుదిరినప్పుడల్లా అతడిపై ప్రేమను గుమ్మరించింది. ముదొస్తున్నాడంటూ ముద్దులు కూడా పెట్టేది.
దర్శిని గౌడతో లవ్
అతడు క్యాజువల్‌గా ఏదైనా మాట్లాడినా సో క్యూట్ అంటూ గింగిరాలు తిరిగేది. తనది లవ్ కాదంటూనే అతడిని ఫ్రెండ్ కన్నా ఎక్కువ అని చెప్పింది. ఆమె ఇంత చేస్తున్నా తనకు మాత్రం ఇంట్రస్ట్ లేదన్నట్లుగానే ఉండేవాడు పృథ్వీ. ఇతడి కోసం ఫ్యామిలీ వీకెండ్‌లో నాగపంచమి సీరియల్ నటి దర్శిని గౌడ స్టేజీపైకి వచ్చింది. ఆమె మాటల్ని చూసిన ప్రేక్షకులు వీళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారా? అని డౌట్ పడ్డారు.
క్లారిటీ ఇచ్చిన పృథ్వీ
సోషల్ మీడియాలో అయితే వీళ్లు కచ్చితంగా ప్రేమికులే అని ముద్ర వేసేశారు. తాజాగా ఈ రూమర్స్‌పై పృథ్వీ స్పందించాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'దర్శిని నాతో కలిసి నటించింది. ఆమె గొప్ప నటి. తను నాకు మంచి ఫ్రెండ్ కూడా! సీరియల్స్‌లో మంచి కెమిస్ట్రీ ఉంది కాబట్టి ఆ సమయంలో మేమిద్దరం లవ్‌లో ఉన్నామన్నారు. కానీ తను నాకు మంచి స్నేహితురాలు మాత్రమే!' అని క్లారిటీ ఇచ్చాడు.
ప్రేమ పెళ్లి చేసుకుంటా..
పెళ్లి గురించి స్పందిస్తూ.. 'పెళ్లి కంటే ముందే నాకంటూ కొన్ని లక్ష్యాలున్నాయి. కెరీర్‌పై ఫోకస్ పెట్టాను. నేను అనుకున్నదాంట్లో ఇంకా పదిశాతం కూడా చేయలేదు. అబ్బాయిలకు ఫస్ట్ లైఫ్‌లో సెటిలవ్వాలి కదా! సమయం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటాను. అది కూడా లవ్ మ్యారేజే' అని పృథ్వీ చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment