Live Updates

BB Telugu 8 Telugu: బిగ్‌బాస్ 8 విజేతగా నిఖిల్ మళియక్కల్
బిగ్‌బాస్ 8 ఫినాలే ఎపిసోడ్ హైలైట్స్

- అదిరిపోయే మాస్ సాంగ్స్‌తో ఎంట్రీ ఇచ్చిన హోస్ట్ నాగార్జున
- ఫినాలే ఎపిసోడ్‌కి వచ్చిన ఈ సీజన్ కంటెస్టెంట్స్.. అనుభవాలు పంచుకున్నారు.
- ఫినాలే వరకు వచ్చిన టాప్-5 హౌస్‌మేట్స్‌తో నాగార్జున మాటామంతీ
- 105 రోజుల జర్నీపై వీడియో ప్లే చేసిన బిగ్‌బాస్
- సీజన్ 8 జ్ఞాపకాల్ని అద్భుతంగా చూపించిన వీడియో
- విజేతకు ఏకంగా రూ.55 లక్షల ప్రైజ్‌మనీ అని ప్రకటించిన నాగార్జున
- ట్రెండీ పాటలతో అలరించిన సింగర్స్ గీతామాధురి-శ్రీకృష్ణ
- డ్యాన్స్‌లతో కేక పుట్టించిన హీరోయిన్లు నభా నటేశ్, లక్ష‍్మీ రాయ్
- విన్నర్ అయితే ఎలా? చేసి చూపించి నవ్వు తెప్పించిన కంటెస్టెంట్స్
- బిగ్‌బాస్ 8 విజేతకు ఇచ్చే ట్రోఫీ రివీల్ చేసిన నాగ్
- 'యూఐ' మూవీ ప్రమోషన్స్ కోసం వచ్చిన ఉపేంద్ర
- టాప్-5లోని అవినాష్‌ని ఎలిమినేట్ చేసి స్టేజీపైకి తీసుకొచ్చిన ఉపేంద్ర
- కాసేపటి తర్వాత వచ్చిన ప్రగ్యా జైస్వాల్.. ప్రేరణని ఎలిమినేట్ చేసింది
- టాప్-3లో నిలిచిన నిఖిల్-గౌతమ్-నబీల్‌కి సిల్వర్ సూట్ కేసు ఆఫర్
- అయినా సరే సూట్ కేసు ఎవరూ తీసుకోలేదు.
- 'విడుదల-2' ప్రమోషన్స్ కోసం వచ్చిన విజయ్ సేతుపతి-మంజు వారియర్
- టాప్-3 నుంచి ఎలిమినేట్.. మూడో స్థానంలో సరిపెట్టుకున్న నబీల్
- టాప్-2లో నిలిచిన గౌతమ్-నిఖిల్‌కి గోల్డెన్ సూట్ కేసు ఆఫర్.
- ఫినాలేకి చీఫ్ గెస్ట్‌గా వచ్చిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్
- బిగ్‌బాస్ 8 విజేతగా నిఖిల్ మళియక్కల్.. రన్నరప్‌గా గౌతమ్
- విజేతగా నిలిచిన నిఖిల్‌కి రూ.55 లక్షల ప్రైజ్‌మనీ, మారుతీ డిజైర్ కారు
బిగ్‌బాస్ 8 విజేతగా నిఖిల్ మళియక్కల్

- బిగ్‌బాస్ 8 విజేతగా నిలిచిన్ నిఖిల్
- చరణ్ చేతుల మీదుగా ట్రోఫీ అందజేత
- రన్నరప్‌తో సరిపెట్టుకున్న గౌతమ్ కృష్ణ
- నిఖిల్ విజేత కావడంతో కన్నీళ్లు పెట్టుకున్న తల్లి
ఫినాలేకి చీఫ్ గెస్ట్‌గా వచ్చిన రామ్ చరణ్

- ఫినాలే కోసం ముఖ్య అతిథిగా వచ్చిన రామ్ చరణ్
- హౌస్‌మేట్స్ అందరితోనూ మాట్లాడిన చరణ్
- ప్రతి ఒక్కరినీ పేరుపేరున పలకరించిన చరణ్
- 'గేమ్ ఛేంజర్' మూవీ సంగతులు చెప్పిన చరణ్
- హోస్ట్ నాగార్జున జర్నీని చూసి ముగ్దుడైన చరణ్
గోల్డెన్ సూట్ కేస్ ఆఫర్ వదులుకున్న ఇద్దరు

- టాప్-2లో నిలిచిన గౌతమ్-నిఖిల్‌కి గోల్డెన్ సూట్ కేసు ఆఫర్.
- సూట్ కేసు పట్టుకుని హౌసులోకి వెళ్లిన నాగార్జున.
- డబ్బులు తీసుకుని తన అభిమానుల్ని మోసం చేయలేనన్న నిఖిల్
- తనకు కూడా డబ్బు వద్దని తెగేసి చెప్పిన గౌతమ్
టాప్-3 నుంచి ఎలిమినేట్ అయిన నబీల్

- మూడో స్థానంలో సరిపెట్టుకున్న నబీల్ అఫ్రిది
- డబ్బుల కోసం హౌసులోకి వెళ్లలేదని చెప్పిన నబీల్
- టాప్-3లో నిలవడంపై థ్యాంక్స్ చెప్పిన నబీల్
'విడుదల-2' ప్రమోషన్స్ కోసం వచ్చిన సేతుపతి

- 'విడుదల-2' ప్రమోషన్స్ కోసం వచ్చిన విజయ్ సేతుపతి-మంజు వారియర్
- సేతుపతి అంటే ఎంతిష్టమో చెప్పిన రోహిణి
- విజయ్ సేతుపతితో ముచ్చటించిన అందరు కంటెస్టెంట్స్
బ్రీఫ్ కేస్ ఆఫర్ ఇచ్చిన నాగార్జున

- బ్రీఫ్ కేసు చూపించి ఆఫర్ ఇచ్చిన నాగార్జున
- అందులో ఎంతుంటే అంత మీదే అని క్లారిటీ
- తనకు డబ్బు వద్దని చెప్పిన నబీల్
- నబీల్ తల్లి కూడా నువ్వు గెలిచిన రావాలి చెప్పింది.
ప్రేరణ ఎలిమినేట్

- హౌసులో నాలుగో ఎలిమినేషన్ చేసేందుకు హౌసులోకి వెళ్లిన ప్రగ్యా జైస్వాల్
- ఎలిమినేట్ అయి స్టేజీపైకి వచ్చిన ప్రేరణ కంభం
- నిన్ను చూసి గర్వంగా ఉందన్న నిఖిల్-గౌతమ్-నబీల్
- టాప్-3లోని అందరికీ ఆల్ దె బెస్ట్ చేసిన ప్రేరణ
హీరోయిన్ నభా నటేశ్ డ్యాన్స్

- షోలో కాస్త ఎంటర్ టైన్‌మెంట్ ఇచ్చేందుకు వచ్చిన నభా నటేశ్
- ఫీలింగ్స్, కుర్చీ మడతపెట్టి, మార్ ముంతా పాటలకు అదిరిపోయే స్టెప్పులు
- నాలుగో ఎలిమినేషన్ చేసేందుకు వచ్చిన హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్
ముందు అలా.. తర్వాత ఇలా

- లడ్డులా ఉండేదాన్ని కాస్త సన్నగా అయ్యానని చెప్పిన ప్రేరణ
- సున్నితంగా ఉండేవాడిని.. 8వ వారం తర్వాత స్ట్రాంగ్ అయ్యానన్న గౌతమ్
- ఎమోషల్ వీక్‌గా ఉండేవాడిని.. మానసికంగా స్ట్రాంగ్ అయ్యానన్న నిఖిల్
- భయపడేవాడిని కాస్త.. మెంటల్లీ స్ట్రాంగ్ అయ్యానని చెప్పిన నబీల్
టాప్-5 నుంచి అవినాష్ ఎలిమినేట్

- టాప్-5 నుంచి తొలి ఎలిమినేషన్‌గా ముక్కు అవినాష్
- హౌసులోకి వెళ్లి అవినాష్‌ని స్టేజీపైకి తీసుకొచ్చిన ఉపేంద్ర
- ఎంత బాగా ఎంటర్‌టైన్ చేశావో అని మెచ్చుకున్న నాగార్జున
- ఫుల్ హ్యాపీగా నవ్వుతూనే బయటకొచ్చేసిన అవినాష్
- ఎలిమినేషన్ ముందే ఊహించిన అవినాష్.. నాగ్‌తో చెప్పాడు
- గౌతమ్ లేదా నిఖిల్.. విజేతగా నిలిచే అవకాశమని అభిప్రాయం
'యూఐ' మూవీ ప్రమోషన్స్ కోసం వచ్చిన ఉపేంద్ర

- బిగ్ బాస్ ఫినాలేకి వచ్చిన కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర
- త్వరలో 'యూఐ' అనే సినిమాతో రాబోతున్న ఉపేంద్ర
- ఇతడే హౌసులోకి వెళ్లి ఓ కంటెస్టెంట్‌ని ఎలిమినేట్ చేయనున్నాడు.
బిగ్‌బాస్ 8 ట్రోఫీ రివీల్ చేసిన నాగ్

- ఈసారి విజేతకు అందివ్వబోయే ట్రోఫీ రివీల్
- ఇన్ఫినిటీ ఆకారంలో ఉన్న ట్రోఫీని చూపించి నాగార్జున
- ట్రోఫీ చూసి మురిసిపోయిన టాప్-5 కంటెస్టెంట్స్
బిగ్‌బాస్ హౌసులో ఫేవరెట్ ప్లేస్‌లో టాప్-5 ఆటోగ్రాఫ్

- డ్రాగన్ ఫ్లై రూంలో బెడ్, తన హార్ట్ పెట్టి ఆటోగ్రాఫ్ చేసిన ప్రేరణ
- గోల్డెన్ రూంలో తన హార్ట్ పెట్టి, ఆటోగ్రాఫ్ చేసిన నబీల్
- లివింగ్ ఏరియాలో హార్ట్ పెట్టి, ఆటోగ్రాఫ్ పెట్టిన అవినాష్
- తన బెడ్, స్విమ్మింగ్ పూల్ గట్టపై హార్ట్స్ పెట్టి, ఆటోగ్రాఫ్ చేసిన గౌతమ్
- బెడ్ రూమ్, గార్డెన్ ఏరియాల్లో హర్ట్ పెట్టి, ఆటోగ్రాఫ్ చేసిన నిఖిల్
విన్నర్ అయితే ఎలా? చేసి చూపించిన కంటెస్టెంట్స్

- ఫన్నీ గేమ్ పెట్టిన హోస్ట్ నాగార్జున
- ఒకవేళ విజేత అయితే ఎలా ప్రవర్తిస్తారో చూపించామని ఛాలెంజ్
- ప్రేరణ, మణికంఠలా చేసి చూపించి తెగ నవ్వించిన అవినాష్
- నబీల్, పృథ్వీ, తేజలా చేసి చూపించిన గౌతమ్
- గౌతమ్, సోనియలా చేసి నవ్వించిన ప్రేరణ
- నిఖిల్.. విన్నర్ అయితే ఎలా ఉంటుందో చూపించిన నబీల్
- అవినాష్‌లా చేసి చూపించిన నిఖిల్.. రోహిణి సెటైర్స్
ట్రెండీ పాటలతో సింగర్స్ గీతామాధురి-శ్రీకృష్ణ

- ఫినాలే ఎపిసోడ్‌లో ఆడవిడుపుగా పాటలు పాడిన స్టార్ సింగర్స్
- ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న సాంగ్స్ తో ఆకట్టుకున్న గీతామాధురి-శ్రీకృష్ణ
- నానా హైరానా, బుజ్జి తల్లి, రంగులే గీతాల్ని పాడిన సింగర్స్
విజేతకు ఏకంగా రూ.55 లక్షల ప్రైజ్‌మనీ

- ఈ సీజన్ విజేతకు రూ.55 లక్షల ప్రైజ్‌మనీ దక్కనుంది.
- బిగ్‌బాస్ చరిత్రలో రూ.50 లక్షలకు పైగా దాటడం ఇదే తొలిసారి
- రూపాయి తక్కువ వచ్చిందని.. రౌండ్ ఫిగర్ చేసిన హౌస్ట్ నాగార్జున.
- ఈ రూపాయి కోసం 'రివర్స్' గేమ్ పెట్టిన హోస్ట్ నాగార్జున
- చివరగా పెట్టిన రివర్స్ గేమ్‌లో విజేతగా నిలిచిన గౌతమ్ కృష్ణ
- ప్రైజ్‌మనీతో పాటు విజేతకు బహుమతిగా మారుతీ డాజ్లర్ కారు
బిగ్ బాస్ 8 హౌస్ వీడియో

105 రోజుల జర్నీపై వీడియో ప్లే చేసిన బిగ్‌బాస్
నవ్వులు, కోపాలు, ఎమోషన్స్.. ఇలా అన్ని ఒకే వీడియోలో
వీడియో చూసి కన్నీళ్లు పెట్టుకున్న అందరు హౌస్‌మేట్స్
సీజన్ 8 జ్ఞాపకాల్ని అద్భుతంగా చూపించిన వీడియో
కన్నీళ్లు పెట్టుకున్న నిఖిల్

టాప్-5లో ఉన్న నిఖిల్ తల్లి.. ఫినాలే కోసం బిగ్ బాస్ హౌసుకి వచ్చింది.
కొడుకుని చూసి తెగ మురిసిపోతూ తన ఆనందాన్ని బయటపెట్టారు.
తల్లి తన గురించి మాట్లాడేసరికి నిఖిల్ కంటి నుంచి ఆనంద భాష్పాలు వచ్చాయి.
ఊపు ఇచ్చే సాంగ్స్‌తో టాప్-5 కంటెస్టెంట్స్

హౌసులో ఉన్న టాప్-5 కంటెస్టెంట్స్ గౌతమ్, నబీల్, అవినాష్, నిఖిల్, ప్రేరణ
మంచి ఎలివేషన్ పాటలతో ఫినాలే ఎపిసోడ్‌కి ఎంట్రీ ఇచ్చారు. షోలో మంచి జోష్ తీసుకొచ్చారు.
అనుభవాలు పంచుకున్న కంటెస్టెంట్స్

- ఈ సీజన్‌లో పాల్గొని ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరూ.. ఫినాలేకి వచ్చారు.
- బయట తమని అందరూ గుర్తుపడుతున్నారని నాగ్ అడిగినప్పుడు చెప్పుకొచ్చారు. బిగ్‌బాస్ షోని ఆకాశానికెత్తేశారు.
హోస్ట్ నాగార్జున మాస్ ఎంట్రీ

- అదిరిపోయే మాస్ పాటలతో హోస్ట్ నాగార్జున.. ఫినాలే ఎపిసోడ్‌కి ఎంట్రీ ఇచ్చాడు.
- ఈ సీజన్‌లో పాల్గొన్న కంటెస్టెంట్స్ అందరూ ఫినాలే ఎపిసోడ్‌కి హాజరయ్యారు.
- విష్ణుప్రియ, హరితేజ, నయని పావని మాత్రం డుమ్మా కొట్టేశారు.
బిగ్‌బాస్ 8వ సీజన్ ఫినాలే షురూ.

- బిగ్‌బాస్ 8వ సీజన్ ఫినాలే షురూ.
- 100 రోజులకు పైగా ప్రేక్షకుల్ని అలరించిన ఈ రియాలిటీ షో.. తుది అంకానికి చేరుకుంది.
- టాప్-5లో నిఖిల్, గౌతమ్, ప్రేరణ, నబీల్, అవినాష్ ఉన్నారు.
- వీళ్లలో విజేత ఎవరనేది మరో మూడు గంటల్లో తేలుతుంది.
- ఎన్నడూ లేని విధంగా ఈసారి విజేతకు రూ.55 లక్షల ప్రైజ్‌మనీ ఇవ్వబోతున్నట్లు హోస్ట్ నాగార్జున స్వయంగా ప్రకటించాడు.
- ఈసారి విజేతగా నిలిచిన వాళ్లకు హీరో రామ్ చరణ్ ట్రోఫీ బహుకరించనున్నారు.