
అవినాష్ టికెట్ టు ఫినాలే గెలిచినప్పటి నుంచి అందరి మనసులో ఒకటే డౌట్.. అతడు డైరెక్ట్‌గా ఫినాలేలో అడుగుపెట్టినట్లేనా? లేదంటే ఈ వారం ఎలిమినేషన్ గండం గట్టెక్కితేనే ఫైనల్‌లో ఉంటాడా? అని! ఈ అనుమానాలకు నాగార్జున క్లారిటీ ఇచ్చేశాడు.

అవినాష్ ఫస్ట్ ఫైనలిస్ట్
తాజా ప్రోమోలో నాగ్ మాట్లాడుతూ.. 'టికెట్ టు ఫినాలే గెలిచిన అవినాష్.. ఈ వారం నామినేషన్స్ నుంచి బయటకు వచ్చి నేరుగా ఫైనల్స్‌కు వెళ్లాడు. ఈ సీజన్ ఫస్ట్ ఫైనలిస్ట్ అవినాష్' అని ప్రకటించాడు. అలాగే డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని కూడా హింటిచ్చాడు. హౌస్‌లో కొందరికి గోల్డ్ టికెట్, మరికొందరికి బ్లాక్ టికెట్ ఇచ్చాడు. ఫస్ట్ బ్లాక్ టికెట్ ఎవరికి వస్తుందో గెస్ చేయమని నిఖిల్‌ను అడిగితే.. తనకు తెలియదని అమాయకంగా ముఖం పెట్టాడు. అందుకే సేఫ్ గేమ్ ఆడొద్దనేదంటూ నాగ్.. నిఖిల్‌కు చురకలంటించాడు.

వీడియోతో దొరికిపోయిన ప్రేరణ
ఇదే ప్రశ్న రోహిణిని అడగ్గా.. పృథ్వీకి బ్లాక్ టికెట్ ఇవ్వాలంది. నేను గేమ్స్ ఆడలేను, అతడు మాత్రమే ఆడగలను అని ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించేవాడని కారణం చెప్పింది. గౌతమ్ వంతురాగా.. బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చారన్న కోపంతో ప్రేరణ.. గెస్టులతో కూడా సరిగా ప్రవర్తించలేదన్నాడు. ఈ క్రమంలో నువ్వు ఫెయిర్‌గా ఆడావా? అని నాగ్.. ప్రేరణను ప్రశ్నించాడు. ఆమె అవునని తలూపడంతో ఫౌల్ గేమ్ ఆడిన వీడియో ప్లే చేశాడు.

విష్ణుప్రియను తప్పుపట్టిన ఆడియన్స్
అది నా గేమ్ అని ప్రేరణ అనగా.. నువ్వు ఫెయిర్‌గా ఆడలేదన్నాడు నాగ్. హౌస్‌లో విన్నర్ ఎవరని విష్ణుప్రియను అడగ్గా ఆమె తన పేరే చెప్పింది. మరి విన్నర్‌లా ఆడుతున్నావా? అని నాగ్ అంటే.. నేను చూసిన సీజన్స్‌లో అన్ని ఆటలు గెలిచినవారు టైటిల్ కొట్టలేకపోయారు అంది. ఆమె అభిప్రాయాన్ని సెట్‌లో ఉన్న ఆడియన్స్ తప్పుపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment