బిగ్‌బాస్‌ చరిత్రలో నిలిచిపోనున్న విష్ణుప్రియ | Bigg Boss Telugu 8: Vishnu Priya Last Fun Game in BB Game | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 8: నేటితో గొడవలకు ఫుల్‌స్టాప్‌.. విష్ణుకు ఇదే చివరి..

Published Sun, Dec 8 2024 4:15 PM | Last Updated on Sun, Dec 8 2024 4:21 PM

Bigg Boss Telugu 8: Vishnu Priya Last Fun Game in BB Game

అవినాష్‌, రోహిణికి మంచి టాలెంట్‌ ఉంది.. నవ్వించడమే కాకుండా టాస్కుల్లోనూ సత్తా చాటారు. ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు తమ సాయశక్తులా ప్రయత్నించారు. అందులో సఫలమయ్యారు కూడా! కానీ ఓట్లు రాబట్టుకోవడంలోనే విఫలమయ్యారు. అయినా నబీల్‌ సాధించిన ఎవిక్షన్‌ షీల్డ్‌ సాయంతో అవినాష్‌ ఎలిమినేషన్‌ నుంచి తప్పించుకున్నాడు. తర్వాత గట్టిగా ఆడి టికెట్‌ టు ఫినాలే కొట్టాడు.

టాప్‌ కంటెస్టెంట్‌ ఎలిమినేట్‌
కానీ రోహిణికి అలాంటి అవకాశం లేకుండా పోయింది. ఎంత గట్టిగా ఆడినా తొలిసారి నామినేషన్స్‌లోకి రావడంతో ఆమెకు పెద్దగా ఓట్లు రాలేదు, ఫలితంగా ఎలిమినేట్‌ అయిపోయింది. నేడు మరో టాప్‌ కంటెస్టెంట్‌ ఎలిమినేట్‌ అవుతోంది. ఆమె ఎవరో కాదు విష్ణుప్రియ. ఈమెకు విపరీతమైన ఫ్యాన్‌బేస్‌ ఉంది. తన నిజాయితీకి ప్రేక్షకులు మంత్రముగ్దులయ్యారు. 

 మోస్ట్‌ జెన్యున్‌ పర్సన్‌
కానీ గెలవాలన్న కసి తనలో లేకపోవడం, పృథ్వీ మైకంలో మునగడంతో విన్నర్‌ అయ్యేంత దమ్మున్న ఈ లేడీ కంటెస్టెంట్‌ ఈ రోజు బిగ్‌బాస్‌ హౌస్‌ను వీడనుంది. చుట్టూ కెమెరాలున్నాయని ఆలోచించకుండా తన మనసుకు ఏదనిపిస్తే అది మాట్లాడేది. హోస్ట్‌ నాగార్జునతో మోస్ట్‌ జెన్యున్‌ పర్సన్‌ అని కితాబు అందుకుంది. నిజమే.. బిగ్‌బాస్‌ చరిత్రలోనే అత్యంత నిజాయితీగా, ఎలాంటి ముసుగు వేసుకోని కంటెస్టెంట్‌గా విష్ణు నిలిచిపోనుంది. వారమంతా ఎలా ఉన్నా వీకెండ్‌లో మాత్రం దుమ్ముదులిపే విష్ణు.. హౌస్‌లో చివరి ఫన్‌ టాస్క్‌నూ హుషారుగా పాల్గొంది. ఈమేరకు ప్రోమో రిలీజైంది. ఏదేమైనా ఈ సీజన్‌లో లేడీ విన్నర్‌ అయ్యే ఛాన్స్‌ను విష్ణు చేజేతులా పోగొట్టుకుంది.

 

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement