సల్మాన్‌ఖాన్‌కు గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి బెదిరింపులు రావడంతో బాలీవుడ్ సూపర్‌స్టార్‌కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు ‘కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్‌ఖాన్ నిర్దోషి’ అని అతని తండ్రి సలీంఖాన్ ప్రకటనపై బిష్ణోయ్ సంఘాలు నిరసన ప్రకటించాయి. ఈ నేపథ్యంలో కృష్ణజింకలు, వాటితో బిష్ణోయ్ సమాజానికి ఉన్న అనుబంధం మరో సారి వార్తల్లోకి వచ్చింది.
వారిది 550 సంవత్సరాల అనుబంధం!
పదిహేనవ శతాబ్దంలో గురు జంబేశ్వర్ (జాంబాజీ అని కూడా పిలుస్తారు) స్థాపించిన బిష్ణోయ్ శాఖ 29 సూత్రాలతో మార్గనిర్దేశం చేయబడింది. జాంబాజీ బోధనలు వన్య ప్రాణులు, చెట్ల ప్రాముఖ్యత, సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తాయి. కృష్ణజింకను తమ ఆధ్యాత్మిక గురువుగా జాంబేశ్వర్ పునర్జన్మగా నమ్మి పూజిస్తారు.
బిష్ణోయ్‌ల జానపద కథల్లోనూ కృష్ణజింక ప్రధానంగా కనిపిస్తుంది. కృష్ణజింకను తన ప్రతీకగా, వ్యక్తీకరణగా ఆరాధించమని జాంబేశ్వర్ తన అనుచరులకు ఆదేశించినట్లు చెబుతారు. తాము కృష్ణజింకలుగా పునర్జన్మ పొందుతామని బిష్ణోయ్‌లు నమ్ముతారు.
చెట్లను బిడ్డల్లా చూసుకోవడం విషయానికి వస్తే...
1730లో జోద్‌పూర్ సమీపంలోని ఖేజర్లీ గ్రామంలో చెట్లను నరికి వేయకుండా కాపాడే క్రమంలో 362 మంది బిష్ణోయిలు మరణించారు. జోద్‌పూర్ మహారాజా అభయ్‌సింగ్ ఆదేశాల మేరకు ఈ మారణకాండ జరిగింది.
కొత్త రాజభవనాన్ని నిర్మించడానికి అభయ్ సింగ్ కలప కోసం చెట్లను నరికి వేయడానికి సైనికులను పంపాడు. అమృతాదేవి అనే మహిళ నాయకత్వంలో బిష్ణోయ్ ప్రజలు ప్రతిఘటించారు. అమృతాదేవి తదితరులు చెట్లను కౌగిలించుకొని వాటిని రక్షించడానికి సాహసోపేతంగా ప్రతిఘటించారు. ఈ సంఘటన 1973 చిప్కో ఉద్యమానికి ప్రేరణ ఇచ్చింది.
(చదవండి: భారతీయ వంటకాలపై రిపబ్లికన్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి పొగడ్తల జల్లు..!)
Comments
Please login to add a commentAdd a comment