నానిని ఇరకాటంలో పెట్టిన నాగ్‌ | Nagarjuna Challenge Nani Reply | Sakshi
Sakshi News home page

Published Sun, Jun 3 2018 11:18 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

Nagarjuna Challenge Nani Reply - Sakshi

సౌత్‌, నార్త్‌ అన్న తేడా లేకుండా ఫిలిం సెలబ్రిటీలు ఫిట్‌నెస్‌ చాలెంజ్‌తో బిజీ అవుతున్నారు. కేంద్ర మంత్రి రాజవర్థన్‌ సింగ్‌ మొదలు పెట్టిన ఫిట్‌నెస్‌ చాలెంజ్‌ను టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్‌, కల్యాన్‌ రామ్‌, నాగార్జున, అఖిల్‌, నాగచైతన్యలు తమ కసరత్తుల వీడియోలోనూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి మరికొంత మంది తారలను చాలెంజ్‌ చేశారు. అయితే తనను చాలెంజ్‌ చేస్తూ నాగార్జున చేసిన ట్వీట్‌ పై యంగ్ హీరో నాని ఆసక్తికరంగా స్పందించాడు.

అఖిల్ చాలెంజ్‌కు స్పందింస్తూ తన జిమ్‌ వీడియోనూ పోస్ట్‌ చేసిన నాగ్‌, నాని, కార్తీ, శిల్పా రెడ్డిలను చాలెంజ్‌ చేశారు. ఈ చాలెంజ్‌ పై స్పందించాన నాని.. ‘చచ్చాను’ అంటూ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం నాని, నాగార్జున కలిసి శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో ఓ మల్టీ స్టారర్‌ సినిమాలో నటిస్తున్నారు. నాగ్ డాన్‌పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో నాని డాక్టర్‌గా కనిపించనున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement