Hum Fit Toh India Fit
-
మాతృభూమిని మాత్రం కష్టపెట్టొద్దు : సల్మాన్
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఏది చేసినా సంచలనమే. సినిమాలు చేసినా.. రియాల్టీ షోలు చేసినా.. చివరికి సోషల్ మీడియాలో ట్వీట్ చేసినా సరే. మొన్నటికి మొన్నా హమ్ ఫిట్‌తో ఇండియా ఫిట్ చాలెంజ్ స్వీకరించి సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియో ఎంత వైరల్ అయిందో తెలిసిందే. తాజాగా సల్మాన్ దీనికి సంబంధించిన ఓ ట్వీట్ చేశాడు .ఇప్పుడు ఇది కూడా వైరల్ అవుతోంది. భారతదేశం పరిశుభ్రంగా ఉంటే.. మనం ఫిట్‌గా ఉంటాం.. మన ఫిట్‌గా ఉంటే.. దేశం బాగుంటుంది.. అయితే ఇప్పుడు ఎవరి ఏది చేయాలనుకుంటున్నారో అది చేయండి. కానీ మాతృభూమిని మాత్రం కష్టపెట్టొద్దు అంటూ సల్మాన్ వార్నింగ్‌లా ఓ ట్వీట్ చేశాడు. సల్మాన్ ప్రస్తుతం భరత్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. Swachh Bharat toh hum fit... hum fit toh India fit.... then u can do whatever u want to do man.. but don't trouble your motherland . pic.twitter.com/JaODFDJVs0 — Salman Khan (@BeingSalmanKhan) August 13, 2018 చదవండి : సల్మాన్... 52 ఏళ్ల వయస్సులోనూ.. -
నామినేట్ చేసినందుకు మోదీకి థ్యాంక్స్!
న్యూఢిల్లీ : ఇటీవల కేంద్ర క్రీడలశాఖా మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ ప్రారంభించిన ‘హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్’కు విశేష స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేను సైతం అంటూ తన ఫిట్నెస్ వీడియోను పోస్ట్ చేశారు. నరేంద్ర మోదీ ఫిట్నెస్ ఛాలెంజ్‌పై భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మానికా బాత్రా స్పందించారు. ప్రధాని మోదీ స్థాయి వ్యక్తి తనకు ఫిట్నెస్ ఛాలెంజ్ విసరడం చాలా సంతోషంగా ఉందన్నారు. తనను గుర్తించి ఫిట్నెస్ ఛాలెంజ్‌కు నామినేట్ (ఆహ్వానించినందుకు) చేసినందుకు ప్రధానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. మోదీ చేసిన ఈ ప్రయత్నం అందరికీ ఉపయోగకరమైనదని పేర్కొన్నారు. క్రీడాకారులతో పాటు ఇతరలుకు కూడా ఫిట్నెస్ అనేది చాలా ముఖ్యమని మానికా అభిప్రాయపడ్డారు. కర్ణాటక సీఎం కుమారస్వామి కూడా మోదీ ఛాలెంజ్‌ను స్వీకరించారు. మహిళల టేబుల్ టెన్నిస్ సింగిల్స్‌లో స్వర్ణ పతకాన్ని అందించిన క్రీడాకారిణి మానికా బత్రా. కామన్వెల్త్ చరిత్రలో టేబుల్ టెన్నిస్ విభాగంలో భారత్ సాధించిన తొలి పతకం కావడం గమనార్హం. ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో సింగపూర్ క్రీడాకారిణి మెయినగ్యు యూతో జరిగిన హోరాహోరీ పోరులో మానికా 11-7, 11-6, 11-2, 11-7 పాయింట్ల తేడాతో నెగ్గి స్వర్ణం కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అతికొద్ది మందిలో మోదీ ఒకరు: రాజ్యవర్థన్ రాథోడ్ తాను ప్రారంభించిన హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్’లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ తన ఫిట్నెస్ విడుదల చేయడంపై కేంద్ర క్రీడలశాఖా మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ హర్షం వ్యక్తం చేశారు. ‘ప్రధాని తరచుగా యువత ఫిట్నెస్ గురించి మాట్లాడేవారు. యువత వల్ల దేశం మరింత అభివృద్ధి చెందుతుందని మోదీ భావించేవారు. ఇలాంటి ఫిట్నెస్ వీడియోలు షేర్ చేసే అతికొద్దిమంది ప్రధానులలో మోదీ ఒకరు. ఈ ప్రచారం మంచిధోరణిలో వెళ్తుంది. ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని’ రాజ్యవర్ధన్ రాథోడ్ వివరించారు. -
మోదీ సవాల్.. స్పందించిన కుమారస్వామి
సాక్షి, బెంగళూరు : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన సవాల్‌పై కర్ణాటక ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి స్పందించారు. ‘హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్’ లో భాగంగా తనకు ప్రధాని మోదీ ఫిట్నెస్ ఛాలెంజ్ విసరడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు కర్ణాటక సీఎం కార్యాలయం ట్విటర్ ద్వారా తెలిపారు. తన ఆరోగ్యంపై మోదీ శ్రద్ధ తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఎవరికైనా ముఖ్యమే. అందుకే ప్రతిఒక్కరూ ఎక్సర్సైజ్, యోగా, జిమ్ లాంటి ఏదో రకంగా ఫిట్నెస్ను కాపాడుకుంటారని పేర్కొన్నారు. తాను రోజూ ట్రెడ్‌మిల్‌పై వర్కవుట్స్, యోగా చేస్తానని కుమారస్వామి వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి గురించి అంతకుమించి ఆందోళన చెందుతున్నానని, అందుకు మీ మద్దతు కావాలంటూ ప్రధాని మోదీని కర్ణాటక సీఎంఓ ట్విటర్ ద్వారా కుమారస్వామి కోరారు. Dear @narendramodi ji I am honoured& thankU very much for d concern about my health I believe physical fitness is imptnt for all&support d cause. Yoga-treadmill r part of my daily workout regime. Yet, I am more concerned about devlpment fitness of my state&seek ur support for it. — CM of Karnataka (@CMofKarnataka) 13 June 2018 కాగా, కర్ణాటక సీఎం కుమారస్వామికి, 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన మానికా బాత్రాతో పాటు 40 ఏళ్లకు పైగా వయసున్న ఐపీఎస్ అధికారులను ‘హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్’ ఛాలెంజ్‌కు మోదీ ట్విటర్ ద్వారా బుధవారం ఉదయం ఆహ్వానించిన విషయం తెలిసిందే. కర్ణాటక సీఎంకు మోదీ సవాల్ -
కర్ణాటక సీఎంకు మోదీ సవాల్
న్యూఢిల్లీ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫిట్నెస్ ఛాలెంజ్‌ను స్వీకరించిన ప్రధాని నరేంద్ర మోదీ ఓ ఫిట్నెస్ వీడియోను పోస్ట్ చేశారు. ఉదయం వేళ ఎక్సర్సైజ్ చేస్తూ.. ప్రకృతిలో ఉండే పంచతత్వాలతో తాను ప్రేరణ పొందానని సోషల్ మీడియాలో మోదీ తెలిపారు. ఇలా చేస్తే ఎంతో రీఫ్రెష్‌గా, ఉత్సాహంగా ఉంటుందని, శ్వాసకు సంబంధించిన ఎక్సర్సైజ్లు చేస్తానంటూ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. మనం ఫిట్‌గా ఉంటేనే ఇండియా ఫిట్‌గా ఉంటుందన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామికి ప్రధాని మోదీ ఫిట్నెస్ ఛాలెంజ్ విసిరారు. 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన మానికా బాత్రాతో పాటు 40 ఏళ్లకు పైగా వయసున్న ఐపీఎస్ అధికారులను ‘హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్’ ఛాలెంజ్‌కు ఆహ్వానించారు. ఇటీవల కోహ్లి విసిరిన ఫిట్నెస్ ఛాలెంజ్‌ను స్వీకరించిన ప్రధాని మోదీ.. తాజాగా తన ఫిట్నెస్ ప్రాక్టీస్‌ను పోస్ట్ చేశారు. ఇటీవల కేంద్ర క్రీడలశాఖా మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ ప్రారంభించిన ‘హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్’లో భాగంగా పుష్ అప్స్ చేస్తున్న వీడియోను ఫిట్నెస్ మంత్ర పేరుతో ట్విటర్లో పోస్ట్ చేస్తూ విరాట్ కోహ్లీ, హృతిక్ రోషన్, సైనా నెహ్వాల్‌ను ట్యాగ్ చేశారు. అయితే దీనిపై స్పందిస్తూ విరాట్ తాను చేస్తున్న ఎక్సర్సైజ్ వీడియోను పోస్ట్ చేశాడు. అంతేకాకుండా తన భార్య అనుష్క శర్మ, ప్రధాని నరేంద్ర మోదీ, మహేంద్ర సింగ్ ధోనిలు ఈ ఛాలెంజ్ స్వీకరించాలంటూ ట్యాగ్ చేశాడు. Here are moments from my morning exercises. Apart from Yoga, I walk on a track inspired by the Panchtatvas or 5 elements of nature - Prithvi, Jal, Agni, Vayu, Aakash. This is extremely refreshing and rejuvenating. I also practice breathing exercises. #HumFitTohIndiaFit pic.twitter.com/km3345GuV2 — Narendra Modi (@narendramodi) 13 June 2018 I am delighted to nominate the following for the #FitnessChallenge: Karnataka’s CM Shri @hd_kumaraswamy. India’s pride and among the highest medal winners for India in the 2018 CWG, @manikabatra_TT. The entire fraternity of brave IPS officers, especially those above 40. — Narendra Modi (@narendramodi) 13 June 2018 I have accepted the #FitnessChallenge by @ra_THORe sir. Now I would like to challenge my wife @AnushkaSharma , our PM @narendramodi ji and @msdhoni Bhai for the same. 😀 #HumFitTohIndiaFit #ComeOutAndPlay pic.twitter.com/e9BAToE6bg — Virat Kohli (@imVkohli) 23 May 2018 -
ఎక్సర్సైజ్ చేస్తూ మోదీ..వైరల్
-
కేటీఆర్‌కు సవాల్ విసిరిన చెర్రీ!
హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్. ఇది ఈ మధ్య బాగా పాపులర్ అవుతోంది. కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ మొదలుపెట్టిన ఈ చాలెంజ్ టాలీవుడ్‌కు చేరింది. మోహన్‌లాల్ వర్కౌట్లు చేస్తూ వీడియోను పోస్ట్ చేస్తు ఎన్టీఆర్‌కు చాలెంజ్ విసిరారు. అఖిల్ , నాగార్జునకు, నాగచైతన్యకూ చాలెంజ్ విసిరారు. చైతు యాక్సెప్ట్ చేసి సమంతకు విసిరారు. అలాగే నాగార్జున కూడా యాక్సెప్ట్ చేసి నానికి సవాలు విసిరారు. ఇలా గొలుసుకట్టులా ఈ చాలెంజ్ టాలీవుడ్ మొత్తం పాకుతోంది. తాజాగా ఎన్టీఆర్ విసిరిన సవాలుకు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ యాక్సెప్ట్ చేశారు. జిమ్‌లో కష్టపడుతున్న వీడియోను పోస్ట్ చేస్తూ.. మెగాస్టార్ చిరంజీవికి, కేటీఆర్‌కు, వరుణ్ తేజ్‌కు, సుకుమార్‌కు సవాల్ విసిరారు. మరి వీరంతా సవాల్‌ను ఎప్పుడు స్వీకరిస్తారో , మళ్లీ ఎవరికి సవాళ్లు విసురుతారో వేచి చూడాలి. Mega Power Star #RamCharan accepts Young Tiger @tarak9999's Fitness Challenge and he challenges #Megastar, @KTRTRS, @IAmVarunTej, @aryasukku #HumFitToIndiaFit pic.twitter.com/FXLi7BNapZ — BARaju (@baraju_SuperHit) June 5, 2018 -
నానిని ఇరకాటంలో పెట్టిన నాగ్
సౌత్, నార్త్ అన్న తేడా లేకుండా ఫిలిం సెలబ్రిటీలు ఫిట్నెస్ చాలెంజ్‌తో బిజీ అవుతున్నారు. కేంద్ర మంత్రి రాజవర్థన్ సింగ్ మొదలు పెట్టిన ఫిట్నెస్ చాలెంజ్‌ను టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, కల్యాన్ రామ్, నాగార్జున, అఖిల్, నాగచైతన్యలు తమ కసరత్తుల వీడియోలోనూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరికొంత మంది తారలను చాలెంజ్ చేశారు. అయితే తనను చాలెంజ్ చేస్తూ నాగార్జున చేసిన ట్వీట్ పై యంగ్ హీరో నాని ఆసక్తికరంగా స్పందించాడు. అఖిల్ చాలెంజ్‌కు స్పందింస్తూ తన జిమ్ వీడియోనూ పోస్ట్ చేసిన నాగ్, నాని, కార్తీ, శిల్పా రెడ్డిలను చాలెంజ్ చేశారు. ఈ చాలెంజ్ పై స్పందించాన నాని.. ‘చచ్చాను’ అంటూ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం నాని, నాగార్జున కలిసి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ మల్టీ స్టారర్ సినిమాలో నటిస్తున్నారు. నాగ్ డాన్పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో నాని డాక్టర్‌గా కనిపించనున్నాడు. Chachanu 🙈 — Nani (@NameisNani) 2 June 2018