మాతృభూమిని మాత్రం కష్టపెట్టొద్దు : సల్మాన్‌ | Salman Khan Tweet About Hum Fit Toh India Fit And Swachh Bharat | Sakshi
Sakshi News home page

Published Mon, Aug 13 2018 1:32 PM | Last Updated on Mon, Aug 13 2018 3:58 PM

Salman Khan Tweet About Hum Fit Toh India Fit And Swachh Bharat - Sakshi

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ ఏది చేసినా సంచలనమే. సినిమాలు చేసినా.. రియాల్టీ షోలు చేసినా.. చివరికి సోషల్‌ మీడియాలో ట్వీట్‌ చేసినా సరే. మొన్నటికి మొన్నా హమ్‌ ఫిట్‌తో ఇండియా ఫిట్‌ చాలెంజ్‌ స్వీకరించి సోషల్‌ మీడియాలో విడుదల చేసిన వీడియో ఎంత వైరల్‌ అయిందో తెలిసిందే. తాజాగా సల్మాన్‌ దీనికి సంబంధించిన ఓ ట్వీట్‌ చేశాడు .ఇప్పుడు ఇది కూడా వైరల్‌ అవుతోంది.

భారతదేశం పరిశుభ్రంగా ఉంటే.. మనం ఫిట్‌గా ఉంటాం.. మన ఫిట్‌గా ఉంటే.. దేశం బాగుంటుంది.. అయితే ఇప్పుడు ఎవరి ఏది చేయాలనుకుంటున్నారో అది చేయండి. కానీ మాతృభూమిని మాత్రం కష్టపెట్టొద్దు అంటూ సల్మాన్‌ వార్నింగ్‌లా ఓ ట్వీట్ చేశాడు. సల్మాన్‌ ప్రస్తుతం భరత్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

చదవండి : సల్మాన్‌... 52 ఏళ్ల వయస్సులోనూ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement