నేను కపిల్ వీరాభిమానిని | Would love to work with Kapil Sharma one day, I'm a huge fan: Riteish Deshmukh | Sakshi
Sakshi News home page

నేను కపిల్ వీరాభిమానిని

Published Thu, Oct 9 2014 10:30 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

నేను కపిల్ వీరాభిమానిని - Sakshi

నేను కపిల్ వీరాభిమానిని

ప్రముఖ టీవీ కమెడియన్ కపిల్‌శర్మ చేయాల్సిన ఓ సినిమా పాత్రను బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ దక్కించుకున్నా డు. తాను కపిల్ వీరాభిమానినని, ఏదో ఒకరోజు ఆయనతో కలిసి పని చేయడాన్ని ఇష్టపడతానని రితేష్ పేర్కొన్నాడు. యష్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ వారు కపిల్‌శర్మ ప్రధాన పాత్రలో ‘బ్యాంక్ చోర్’ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధమయ్యారు. అయితే అనివా ర్య కారణాల వల్ల ఈ చిత్రంలోని కపిల్ పాత్ర తనకు దక్కిందని రితేష్ చెప్పాడు. రుణం తీసుకొని తిరిగి చెల్లించలేని ఓ సామాన్య వ్యక్తి బ్యాంకు దొంగగా మారటమే ఈ చిత్రం ఇతివృత్తం అని అన్నాడు. ఈ సినిమా కోసం మెహబూబ్ స్టూడియోలో ఓ బ్యాంకు సెట్ వేశారు.
 
 అత్యధిక భాగం బ్యాంకులోనే షూటింగ్ జరపాల్సి ఉందని రితేష్ చెప్పాడు. సామాన్యుడైన హీరో సమస్యల వలయంలో చిక్కుకుంటాడని, వాటి నుంచి బయటపడేందుకు బ్యాంకును చోరీ చేయడమే మార్గంగా భావిస్తాడని అన్నాడు. దేవుడి పట్ల భయభక్తులు ఉన్న ఓ మహారాష్ట్ర వ్యక్తి పాత్రలో తాను నటిస్తున్నానని ఈ 35 ఏళ్ల నటుడు చెప్పాడు. బంపీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వచ్చే మార్చి నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పా డు. ఈ చిత్రంలో ఇంకా వివేక్ ఓబెరాయ్, రియా చక్రవర్తి కూడా నటిస్తున్నారు. షూటింగ్ ప్రారంభానికి ముందు పాత్రలను పరిచయం చేసేం దుకు నటులందరితో ఒక వర్క్‌షాప్ నిర్వహించారు. పాత్రలన్నీ విభిన్నమైనవని, అందువల్లనే వర్క్‌షాప్‌ను దాదాపు పది రోజుల పాటు నిర్వహించాల్సి వచ్చిందని రితేష్ దేశ్‌ముఖ్ చెప్పాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement