అమ్మ అనిపించుకోవడానికి ఇంకొన్ని రోజులే...! | Genelia D’Souza shows off her baby bump with Riteish Deshmukh- View pics! | Sakshi
Sakshi News home page

అమ్మ అనిపించుకోవడానికి ఇంకొన్ని రోజులే...!

Published Tue, Sep 30 2014 10:57 PM | Last Updated on Sat, Sep 2 2017 2:11 PM

అమ్మ అనిపించుకోవడానికి ఇంకొన్ని రోజులే...!

అమ్మ అనిపించుకోవడానికి ఇంకొన్ని రోజులే...!

 ‘బొమ్మరిల్లు’ సినిమాతో హాసినిగా తెలుగు ప్రేక్షకులపై గాఢమైన ముద్ర వేసిన జెనీలియా, హిందీ నటుడు రితేశ్ దేశ్‌ముఖ్‌ను పెళ్లాడి దాదాపుగా సినిమాలకు దూరమయ్యారు. త్వరలో ఆమె ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారు. తాను గర్భవతినన్న విషయం తెలియగానే మీడియా కంట పడకుండా డ్రెస్సింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎప్పుడైనా బయటకు రావాల్సి వస్తే పొట్ట కనిపించకుండా లూజ్ షర్ట్స్ వేసుకొని కవర్ చేసేసేవారు జెన్నీ. ఇటీవలే తన భర్త రితేశ్‌తో కలిసి ముంబయ్‌లోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌లో డిన్నర్‌కి వచ్చారామె. యాదృచ్ఛికమో, లేక ముందే ప్లాన్ చేసుకున్నారో తెలీదుకానీ... అదే రెస్టారెంట్‌లో కరీనా, సైఫ్ అలీఖాన్ కూడా ఉన్నారు. రెండు జంటలూ కలిసి ఆ ఆహ్లాద వాతావరణంలో డిన్నర్ చేసి కాసేపటి తర్వాత బయటకొచ్చారు. ఆ సమయంలో జెన్నీ కొన్ని కెమెరాలకు చిక్కేశారు. జీన్స్ ప్యాంట్, టీషర్ట్, ఓవర్ కోట్‌లో దర్శనమిచ్చిన జెన్నీ... ఈ దఫా తన కడుపు(బేబీ బంప్)ను దాచలేకపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement