ఛత్రపతి శివాజీ మార్కెట్‌కు పూర్వవైభవం
Published Thu, Oct 3 2013 11:06 PM | Last Updated on Wed, Apr 3 2019 4:53 PM
సాక్షి, ముంబై: నగరంలోని ఛత్రపతి శివాజీ మార్కెట్ భవనం పూర్వవైభవం సంతరించుకోనుంది. ఇందుకు కారణం బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) దీనిని పునర్నిర్మించనుండడమే. ఇందుకోసం సదరు భవనాన్ని ఖాళీ చేయాలంటూ ఆదేశాలుకూడా జారీ చేసింది. ఈ భవనం శిథిలావస్థకు చేరుకున్నట్టు వారం క్రితం జరిపిన నిర్మాణ మదింపులో తేలింది. ఇటీవల డాక్‌యార్డులోని బీఎంసీ భవనం కూలిన ఘటనలో 61 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కార్పొరేషన్ ముందు జాగ్రత్తగా ఈ భవనానికి మరమ్మతులు నిర్వహించనుంది.
అయితే ఛత్రపతి శివాజీ మార్కెట్ భవనంలో కార్పొరేషన్‌కు చెందిన సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, ఆక్ట్రాయ్, ఎస్టేట్ విభాగాలతోపాటు మరో ఆరు కార్పొరేషన్ కార్యాలయాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ భవనంలో నగర పోలీసు శాఖతోపాటు అనేక ప్రైవేటు సంస్థలకు చెందిన కార్యాలయాలు కూడా ఉన్నాయి. అయితే గతంలోనే ఈ భవనం స్లాబ్ కూలడంతో బీఎంసీ సీబ్బంది దీనిపై ఫిర్యాదు చేశారు. ఇప్పటికీ ఈ శాఖలకు మరో ప్రత్యామ్నాయాన్ని సమకూర్చలేదని ఓ అధికారి వివరించారు. దీంతో భవనం ఖాళీ చేయడం, మరమ్మతు పనుల్లో జాప్యం జరగొచ్చని అభిప్రాయపడ్డారు. ఇదిలాఉండగా సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మరో ప్రత్నామ్నాయ కార్యాలయం కోసం నెల క్రితం నగర ఇంజనీరింగ్ విభాగానికి ఓ లేఖ రాశామన్నారు. అయినప్పటికీ ఎటువంటి
స్పందనా రాలేదని తెలిపారు.
అంతేకాకుండా కొత్త కార్యాలయాన్ని చూసే బాధ్యతను తమకే అప్పగించారన్నారు. ఈ భవ నానికి స్ట్రక్చర్ ఆడిట్‌ను నిర్వహించే అంశంపై ఆలస్యంగా నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.ఇదిలా ఉండగా నిర్మాణ మదింపు జరపకుండానే మూడో అంతస్తులోని గ్యాలరీని తొలగించిందన్నా రు. కాగా, ఈ భవనంలో అనేకచోట్ల పైకప్పు ప్లాస్టర్ ఊడి పడుతోందని. నిర్మాణ మదింపు నిర్వహించడంతోపాటు, తగు మరమ్మతు పనులు చేపట్టిఉంటే తాము మరో చోటికి వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదన్నారు.
Advertisement
Advertisement