
గతనెలలో హిందీ రిలీజైన 'ఛావా' సినిమా బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే రూ.600 కోట్లకు పైగా వసూళ్లు సాధించి దూసుకెళ్తోంది. ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు తెలుగు ట్రైలర్ తాజాగా విడుదల చేశారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. మరి థియేటర్లలో?)
'ఉరి', 'సర్దార్ ఉద్దమ్ సింగ్' తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కాస్త పరిచయమైన విక్కీ కౌశల్.. 'ఛావా'లో మరాఠ యోధుడు ఛత్రపతి శివాజీ కుమారుడిగా నటించాడు. రష్మిక హీరోయిన్. పీరియాడికల్ కాన్సెప్ట్ తో తీసిన ఈ చిత్రాన్ని ఉత్తరాది ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
ఈ క్రమంలోనే టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్.. తెలుగులో ఛావా చిత్రాన్ని రిలీజ్ చేస్తోంది. మార్చి 7న అంటే ఈ వీకెండ్ లో మూవీ రిలీజ్. 3 నిమిషాలున్న ట్రైలర్.. మంచి పవర్ ఫుల్ గా ఉంది. మీరు ఓ లుక్కేసేయండి.
(ఇదీ చదవండి: 97వ ఆస్కార్ విజేతల పూర్తి జాబితా.. ఉత్తమ చిత్రం 'అనోరా')
Comments
Please login to add a commentAdd a comment