మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన బిగ్గెస్ట్ ఏరియల్ వార్ డ్రామా ‘ఆపరేషన్ వాలెంటైన్ ’. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మానుషి చిల్లర్ హీరోయిన్‌గా నటించగా.. నవదీప్ కీలక పాత్ర పోపించాడు. మార్చి 1న తెలుగు,హిందీ భాషల్లో విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ‘మన దేశంలో సినిమా అనేది బిగ్గెస్ట్ ఎంటర్ టైన్మెంట్. సరదాగా కాలక్షేపం చేయాలంటే అందరు ముందు సినిమా వైపు వెళ్తారు. ప్రేక్షకులు కష్టపడి సంపాదించిన డబ్బుని టికెట్ రూపంలో మాకు ఇస్తారు. ప్రేక్షకులు ఖర్చుపెట్టే డబ్బులకి న్యాయం చేయాలని ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాను. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వడానికి కష్టపడుతుంటాను.
ప్రేక్షకులకు కొత్త కథ చూపించాలనే ప్యాషన్ నాకు, మా టీంకు ఉంది. అందుకే 'ఆపరేషన్ వాలెంటైన్'లాంటి సినిమాని తీయగాలిగాం. తెలుగులో మొట్టమొదటి ఏరియల్ ఫిల్మ్ అవ్వబోతుంది. చాలా కొత్తగా, ఎడ్జ్ అఫ్ ది సీట్ కూర్చుని గూస్ బంప్స్ మూమెంట్స్ ని ఎంజాయ్ చేసే చాలా సీన్స్ ఇందులో ఉన్నాయి. మార్చి 1న ఈ సినిమాని చాలా గర్వంగా గుండెలు నిండా దేశభక్తితో చూసి మన జవాన్స్ కి సెల్యూట్ కొడతారు ప్రేక్షకులు. మన జవాన్స్ త్యాగాలని గుర్తు చేసుకుంటూ వారి ధైర్య సాహసాలని మీముందుకు తీసుకురావడాని చేస్తున్న ప్రయత్నం ఈ సినిమా. కచ్చితంగా ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుంది. అందరికీ దేశభక్తి లోపల ఉంటుంది. ఈ సినిమా చూశాక అది మరింత పెరుగుతుందని నమ్మకంగా చెబుతున్నాం’ అన్నారు.
(Operation Valentine Trailer: ఏం జరిగినా సరే.. చూసుకుందాం అంటూ సవాల్ విసిరిన వరుణ్‌తేజ్)
హీరోయిన్ మానుషి చిల్లర్ మాట్లాడుతూ.. 'ఆపరేషన్ వాలెంటైన్' చాలా స్పెషల్ మూవీ. ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. వరుణ్ తేజ్ వండర్ ఫుల్ కో స్టార్. చాలా సపోర్ట్ చేశారు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ అద్భుతంగా ఈ సినిమాని తీశారు. ఇది నాకు డ్రీం రోల్. సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుంది’’ అన్నారు.
నవదీప్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో చాలా కీలకమైన పాత్ర చేశాను. తెలుగులో మొట్టమొదటి ఎయిర్ ఫోర్స్ యాక్షన్ సినిమా చేసిన ఘనత వరుణ్ తేజ్ కి దక్కుతుంది. 'ఆపరేషన్ వాలెంటైన్' ట్రైలర్ లో విజువల్స్ ఎక్స్ ట్రార్డినరీ గా వున్నాయి. మార్చి 1న థియేటర్స్ లో కలుద్దాం’’ అన్నారు
దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ.. వరుణ్ తేజ్ కి, నిర్మాతలకు కృతజ్ఞతలు. వారి వలనే ఈ సినిమా సాధ్యపడింది. ఈ సినిమా సమిష్టి కృషి. టీం అందరం సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేశాం. యాక్షన్ డ్రామా ఫన్ ఎమోషన్ అన్ని ఎలిమెంట్స్ ఇందులో వున్నాయి. మార్చి 1 సినిమాని ఎంజాయ్ చేయండి’ అని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment