‘మట్కా’లో వరుణ్ తేజ్‌ప్రామిస్ చేశారు. ఎవరికి? ఎందుకు? అనేది తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్ ‘మట్కా’. ఈ చిత్రంలో నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి హీరోయిన్లు. కరుణ కుమార్ దర్శకత్వంలో డా. విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు. శుక్రవారం (జనవరి 19) వరుణ్ తేజ్ బర్త్ డే.
ఈ సందర్భంగా ‘మట్కా’ నుంచి ఓపెనింగ్ బ్రాకెట్ అంటూ ఓ వీడియోను షేర్ చేశారు మేకర్స్. ఇందులో వరుణ్ తేజ్ ప్రామిస్’ అంటూ టెలిఫోన్‌లో మాట్లాడటం కనిపిస్తుంటుంది. యావత్ దేశాన్ని కదిలించిన వాస్తవ ఘటన ఆధారంగా ‘మట్కా’ కథను రూపొందించారు. 24 ఏళ్ల టైమ్ పీరియడ్‌లో (1958–1982) సాగే ఈ కథలో వరుణ్ తేజ్ నాలుగు విభిన్నమైన గెటప్‌లలో కనిపించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన ఓ భారీ సెట్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.
‘‘ఓ గ్యాంబ్లింగ్ మాఫియా అధిపతి నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది (ఈ పాత్ర వరుణ్ తేజ్‌ది అని ఊహించ వచ్చు). ఈ చిత్రంలో ఓ గ్యాంగ్‌స్టర్ పాత్రలో నవీన్ చంద్ర, పోలీసాఫీసర్ పాత్రలో పి. రవిశంకర్ కనిపిస్తారు. కథ రీత్యా 1950, 1980 నాటి పరిస్థితులను రీ క్రియేట్ చేయడంలో దర్శకులు కరుణ కుమార్ విజయం సాధించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. కన్నడ కిశోర్, రవీంద్ర విజయ్, ‘సత్యం’ రాజేశ్, రవిశంకర్, అజయ్ ఘోష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్.
Comments
Please login to add a commentAdd a comment