ఫిదా కుర్రాడు, అందాల రాక్షసి ఒక్కటయ్యారు. వరుణ్‌తేజ్- లావణ్యల ప్రేమకు పునాది పడిన ఇటలీలోనే పెళ్లి చేసుకున్నారు. నవంబర్ 1న ఇటలీలోని టస్కనీలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మూడు రోజుల నుంచి పెళ్లి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఈ పెళ్లి వైభవాన్ని తిలకించేందుకు చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, నితిన్ లాంటి వారంతా సతీసమేతంగా వచ్చి నూతన దంపతులను ఆశీర్వదించారు. అయితే ఈ పెళ్లిలో యంగ్ టైగర్ లేని లోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
తమ పెళ్లికి రావాల్సిందిగా కోరుతూ జూనియర్ ఎన్టీఆర్‌కు వరుణ్-లావణ్య పెళ్లిపత్రిక అందజేశారు. అయినప్పటికీ తారక్ వీరి పెళ్లికి హాజరు కాలేదని తెలుస్తోంది. అందుకు కారణం.. ఆయన దేవర సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటమే! ప్రస్తుతం తారక్.. కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు. గోవాలో భారీ యాక్షన్ సీన్ల షూటింగ్ జరుగుతోంది.
తను షూటింగ్ ఆపేసి వెళ్తే తన కారణంగా చిత్రయూనిట్ అంతా ఇబ్బందిపడాల్సి వస్తుందని తారక్ పెళ్లికి వెళ్లకుండా అక్కడే ఉండిపోయాడట. మొత్తానికి దేవర కారణంగానే జూనియర్ ఎన్టీఆర్.. వరుణ్ పెళ్లికి వెళ్లలేదని తెలుస్తోంది. అయితే నవంబర్ 5న జరగబోయే రిసెప్షన్‌కు మాత్రం తారక్ సహా ఇతర టాలీవుడ్ సెలబ్రిటీలంతా హాజరవనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment